twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఇది రణరంగం.. రణ చదరంగం...' అంటూ ఎన్టీఆర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఇది రణరంగం.. రణ చదరంగం...' అంటూ ఎన్టీఆర్ పాటెత్తుకున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' లో ఈ పాట చోటు చేసుకోనుంది. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రుతి హాసన్‌ కీలక పాత్రలో కనిపిస్తుంది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

    ఈ విషయమై హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ... " 'ఇది రణరంగం.. రణ చదరంగం... జరగాల్సిందే శర విద్వంసం' అంటూ శ్రీమణి అద్బుతంగా రాసారు..యంగ్ టైగర్ జస్ట్ చింపింగ్స్ " అంటూ ట్వీట్ చేసారు.

    Idhi Rana Rangam .. Rana Chadarangam Song on NTR

    నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌కి క్లాస్‌ ఇమేజ్‌ ఇచ్చిన 'బృందావనం' తర్వాత ఈ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. ''ఎన్టీఆర్‌ మార్కు నటన, హరీష్‌ శంకర్‌ వైవిధ్యమైన చిత్రణతో సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్‌పై 'ఇది రణరంగం.. రణ చదరంగం...' అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా..' ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అని పేర్కొన్నారు.

    తమన్ మాట్లాడుతూ...."ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్షా తర్వాత నేను చేస్తున్న మూడో సినిమా ఇది. హరీష్ ఎంత మంచి సంగీతాన్ని రాబట్టుకుంటారో అందరికీ తెలిసిందే. చక్కటి పాటలు కుదిరాయి'' అని అన్నారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా అనే సానుకూల దృక్పథం ఉన్న పాటను రాసినట్టు అనంతశ్రీరామ్ అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేయాలనే తపనతో కృషి చేసినట్టు రమేష్ రెడ్డి తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఎన్టీఆర్‌లో కొత్త లుక్‌, నూతన సంభాషణ శైలి చూస్తారు. యువతరానికి నచ్చే కుటుంబ కథాచిత్రంగా నిలుస్తుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

    'రామయ్యా వస్తావయ్యా' లో ఎన్టీఆర్‌, సమంత జంటగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు పాటలు: సాహితి, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి, సంగీతం: థమన్.యస్.యస్., కెమెరా: ఛోటా.కె.నాయుడు, ఎడిటింగ్; గౌతమ్‌రాజు, ఆర్ట్; బ్రహ్మకడలి, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు: దినేష్, గణేష్, శేఖర్ భాను, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.యస్., నిర్మాత: రాజు, సహ నిర్మాతలు; శిరీష్ లక్ష్మణ్.

    English summary
    HarishShankar.S tweeted "Idhi Rana Rangam .. Rana Chadarangam Jaragaalasindhe shara vidhwamsam " Awesome lyrics by Srimani .. Young tiger is Just Chimpingsssssss;"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X