Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘నగ్నంగా ఫీలవుతున్నా’ అంటూ అనుష్క కామెంట్!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ రోహ్లీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ గత కొంత కాలంగా బాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సందర్భాల్లో విరాట్ కోహ్లీ, అనుష్క రహస్యంగా కలుసుకోవడానికి తోడు...ఇటీవల న్యూజీలాండ్‌లో ఇద్దరూ కలిసి తిరుగుతూ కెమెరాకు చిక్కడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
ఆ సంగతి పక్కన పెడితే....దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ప్రముఖ టెలివిజన్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో అనుష్క శర్మ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ స్టార్ వరల్డ్ ఛానల్లో ఫిబ్రవరి 9న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇపుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్ అనుష్క శర్మను పలు ఆసక్తికర విషయాల గురించి ప్రశ్నించారు. విరాట్ కోహ్లీతో ఉన్న ఎఫైర్ గురించి, మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి కూడా ప్రశ్నించారని ఈ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ ప్రమోలో ఓ చోట అనుష్క శర్మ.....'నేను నగ్నంగా ఫీలవుతున్నాను' అని వ్యాఖ్యానించింది.
'నేను నగ్నంగా ఫీలవుతున్నాను' అని అనుష్క శర్మ ఎందుకు వ్యాఖ్యానించింది? కరణ్ జోహార్ ఆమెను ఏమని ప్రశ్నించారు? అనే విషయాలు తేలాలంటే ఈ నెల 9న ప్రసారం అయ్యే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం చూడాల్సిందే. మొత్తానికి అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కార్యక్రమంపై అందరిలోనూ ఆసక్తినెలకొనేలా చూసింది. మరి టీఆర్పీ రేటింగులు ఏ రేంజిలో వస్తాయో చూడాలి.