keyboard_backspace

మోడీ పుట్టినరోజు: 2014 నుంచి జన్మదిన వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో తెలుసా?

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నేతగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం 70వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ దేశాధినేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు.. దీనికి మినహాయింపు కాదు. అన్ని రంగాల బిగ్ షాట్స్ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

కమలనాథుల్లో జోష్

కమలనాథుల్లో జోష్

ఇక భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాల్సిన పనే లేదు. బీజేపీలో పండగ వాతావరణం నెలకొంది. కమలనాథుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమ ప్రియతమ నేత నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహం పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రక్తదాన శిబిరాలు వెలిశాయి. అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంచిపెడుతున్నారు.

14 నుంచి 20 వరకు సేవా వారోత్సవాలు..

14 నుంచి 20 వరకు సేవా వారోత్సవాలు..

ఈ సేవా వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నాడే చేపట్టారు. 20వ తేదీ వరకు కొనసాగించబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వారోత్సవాలను ప్రారంభించారు. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టేలా బీజేపీ ప్రణాళికలను రూపొందించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి మొదలుకుని, బూత్ స్థాయి కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యులను చేశారు.

14 నుంచి 20 వరకు సేవా వారోత్సవాలు..

14 నుంచి 20 వరకు సేవా వారోత్సవాలు..

ఈ సేవా వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నాడే చేపట్టారు. 20వ తేదీ వరకు కొనసాగించబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వారోత్సవాలను ప్రారంభించారు. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టేలా బీజేపీ ప్రణాళికలను రూపొందించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి మొదలుకుని, బూత్ స్థాయి కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యులను చేశారు.

సైకిల్ ర్యాలీ..

సైకిల్ ర్యాలీ..

దేశ రాజధానిలో బీజేపీ నేతలు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ లోక్‌సభ సభ్యుడు అరుణ్ సింగ్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు మోడీ మాస్కులను ధరించి సందడి చేశారు. వివిధ దేశాధినేతలు నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారీనా, నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మోడీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. వివిధ దేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి.

2014లో

2014లో

2014లో నరేంద్ర మోడీ తన పుట్టినరోజును తల్లి హీరాబెన్‌తో కలిసి జరుపుకొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన జరుపుకొన్న మొదటి పుట్టినరోజు వేడుకలు అవి. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు సాధారణ వ్యక్లిలా వెళ్లిన ఆయన అక్కడ తల్లిని కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరాబెన్ 5000 రూపాయలను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చారు.

 2015లో

2015లో

2015లో మోడీ తన 65వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా 1965 నాటి వార్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 2965 భారత్-పాకిస్తాన్ గోల్డెన్ జుబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అమరవీరులకు శౌర్యాంజలిని అర్పించానని మోడీ ట్వీటర్‌లో వెల్లడించారు. ఆయన పుట్టినరోజును స్వచ్ఛతా దివస్‌గా పాటించారు. 2016లోనూ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నివసిస్తోన్న తన పుట్టినరోజు సందర్భంగా మోడీ మరోసారి తల్లిని కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ గుజరాత్‌లోని కెవాడియాలో నిర్మించిన సర్దార్ సరోవార్ డ్యామ్‌ను ప్రారంశించారు. ఆ మరుసటి సంవత్సరం.. తన సొంత నియోజకవర్గం వారణాశిలో గడిపారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. గత ఏడాది 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెవాడియాలో బట్టర్ ఫ్లై గార్డెన్‌ను ప్రారంభించారు. జంగిల్ సఫారీలో గడిపారు. ఈ సారి ఆయన షెడ్యూల్ ఏమిటనేది తేలాల్సి ఉంది.

English summary
Narendra Modi since becoming the prime minister, he has celebrated his birthdays either meeting his mother or common people. As PM Modi will be celebrating his 70th birthday on September 17, here is a look at all that he has done on his special day since taking over as the prime minister.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X