కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోయే సమయంలో.. కొంగొత్త ఆశలు.. సరికొత్త విజయాలను కోరుకోవడం సహజం. మనమంతా గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ.. రాబోయే రోజుల కోసం తీపి కలలు కంటుంటాం. విషింగ్, చీరింగ్ తోపాటే కొత్త తీర్మానాలు చేసుకుంటాం. శుభాకాంక్షలు విజయానికి హామీ ఇవ్వవు, కానీ గెలుపు దారులను అవి కచ్చితంగా ప్రకాశింపజేస్తాయి.. ఆ బాటలో మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కొత్త తీర్మానాలు కూడా అలాంటివే.. లక్ష్యాలను మనమింకా సాధించలేదనే విషయాన్ని గుర్తు చేస్తాయి. మీకెంతో ప్రియమైన వ్యక్తులకు ఉత్సాహాన్నిచ్చే శుభాకాంక్షలను, సంతోషకరమైన తీర్మానాలను వన్ ఇండియా అందిస్తోంది. వీటి ద్వారా మీరు ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఇక్కడున్నవాటిలో మీకు నచ్చిన విషెస్‌ను అలాగే రిజల్యూషన్‌ను ఎంచుకుని ప్రియమైన వ్యక్తులకు సోషల్ మీడియాలో షేర్ చేయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.