• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంచనాలను మించిన పెట్టుబడులు

By Staff
|

హైదరాబాద్‌: భారత పరిశ్రమల సమాఖ్య. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి అంచనాలను మించిన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.

ఈ సదస్సులో సుమారు 35 వేల కోట్లరూపాయల విలువజేసే పెట్టుబడి ప్రతిపాదనలపై సంతకాలు జరిగాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు. గురువారం నాడు సదస్సు ముగింపు సభలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సురేష్‌ ప్రభు పాల్గొన్నారు.

తమది వ్యాపారం చేసే ప్రభుత్వంగా కాకుండా వ్యాపారాన్ని ప్రొత్సహించేప్రభుత్వంగా వుండాలన్నది తన తపన అని ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వ్యాపారులకు తమ ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని ఆయన తెలిపారు.

పారిశ్రామికవేత్తలకు మౌలిక వసతులను కల్పించడంతో పాటు వారి పెట్టుబడులకు తాము పూర్తి భద్రత కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. ఐటి ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో దారిద్ర్యాన్ని నిర్మూలించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆయన చెప్పారు.

26 ఎంఒయులపై ఒప్పందం

ఈ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం వివిధ పారిశ్రామిక సంస్థలతో మొత్తం 26 ఎంఒయులపై సంతకాలు చేసింది. మరికొన్ని ఎంఒయులు కూడా ప్రతిపాదనలో వున్నయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి విద్యాధరరావు వెల్లడించారు.

కనీసం 72 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో వున్నట్టుగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కాగా గ్రామీణప్రాంతాల్లో అతిపెద్ద మార్కెట్‌ సిద్ధంగా వున్నదని పారిశ్రామిక వేత్తలు ఈ మార్కెట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రికి ప్రశంసల జల్లు

దేశప్రజల ఆలోచన విధానంలో మార్పుకు ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తిదాయకంగా వుంటున్నదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రశంసించారు. విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలనే కేంద్రప్రభుత్వం కూడా అనుసరిస్తుందని ఆయన వెల్లడించారు.

రాష్ట్రప్రభుత్వం ఎన్ని అడ్డంకులువచ్చినా వెరవకుండా విద్యుత్‌ సంస్కరణల విషయంలో ముందుకు సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లో కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్రాలతో విద్యుత్‌ రంగానికి సంబంధించి ఎంఒయులపై సంతకాలు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more