వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామగుండం నుంచి మరిన్నివెలుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ఃరామగుండలోని నేషనల్‌ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏడోయూనిట్‌ కు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు గురువారం శంఖుస్థాపనచేశారు. 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం వున్న ఈ ఏడోయూనిట్‌ ను మూడేళ్ళలో పూర్తి చేయాలనిఎన్‌.టి.పి.సి. సంకల్పించింది. 1920 వేల కోట్లరూపాయల ఖర్చుతో నిర్మించే ఈ యూనిట్‌ పూర్తయితే రామగుండంఎన్‌.టి.పి.సి. ఉత్పత్తి సామర్ధ్యం 2,600 మెగావాట్లకు పెరుగుతుంది.

ఈ యూనిట్‌ కు కావలసిన 24 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకుసంబంధించి సింగరేణితో ఒప్పందం కుదరడంతో ఈయూనిట్‌ జీవం పోసుకున్నది. ఈ యూనిట్‌పనిచేయడం ప్రారంభమైతే రాష్ట్రానికి కూడాఅవసరాలకు సరిపడా విద్యుత్‌ సరఫరా అయ్యే అవకాశంవుంది.

ప్రతిష్ఠాత్మకమైన ఈయూనిట్‌ శంఖుస్థాపన అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రిసురేష్‌ ప్రభు మాట్లాడుతూ దేశంలో ఇంకా పలు గ్రామాలువిద్యుత్‌ సరఫరా సౌకర్యం లేక అంధకారంలోమగ్గుతున్నాయని, ఆ గ్రామాలకు కూడా విద్యుత్‌ సరఫరాచేయడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోకేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి జయవంతిమెహతా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రులు సుబ్బారాయుడు, పెద్దిరెడ్డి తదితరులుపాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X