వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః ప్రపంచవాణిజ్య సంస్థలో చేరడం వల్ల భారత్‌ కు ఏ మాత్రంనష్టం వుండనదని ఆ సంస్థ అధ్యక్షుడుమైక్‌ మోర్‌ చెప్పారు. హైదరాబాద్‌ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగానిర్వహిస్తున్న భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో గురువారంఆయన ప్రసంగించారు. వ్యవసాయ ఆధారితమైనభారతదేశం వంటి దేశాల విషయంలో డబ్ల్యు.టి.ఓ. ప్రత్యేకశ్రద్ధ చూపిస్తుందని ఆయన ఈ సందర్భంగాహామీ ఇచ్చారు.

By Staff
|
Google Oneindia TeluguNews

డబ్ల్యు.టి.ఓ.లో చేరడంవల్ల భారత్‌ కు వ్యాపార ఆర్థిక రంగాలలో కొన్నిఇబ్బందులు ఎదురైనా అవి స్వల్పకాలం మాత్రమేనని ఆ తరువాత భారత్‌అద్భుతమైన ప్రగతి సాధించేందుకు ఇదిఎంతో ఉపయోగపడుతుందని మూర్‌ వివరించారు.డబ్ల్యు.టి.ఓ. ఒప్పందం వ్యవసాయ రంగానికి, రైతులకువ్యతిరేకమైనదంటూ జరుగుతున్న ప్రచారంఅర్థంలేనిదని ఆయన వ్యాఖ్యానించారు.భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనుడబ్ల్యు.టి.ఓ. సానుభూతితో అర్థంచేసుకుంటుందని, ఒప్పందం సందర్భంగా భారత రైతుల గురించి ప్రత్యేక పరిశీలన జరుపుతామనిఆయన హామీ ఇచ్చారు.

అభివృద్ధిసాధనలో ఆధునిక కాలంలో వస్తున్న అవకాశాలనుసద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ప్రపంచంలో అసమానతలు తొలగించాలన్నదేడబ్ల్యు.టి.ఓ. ఏకైక లక్ష్యమని ఆయనచెప్పారు. సమర్థ నాయకత్వం, పుష్కలమైనవనరులు వున్న భారతదేశం ఆర్థిక సూపర్‌ పవర్‌ గాఎదిగే అవకాశాలు బాగా వున్నాయని మూర్‌ వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X