వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనాన్షియల్‌జిల్లాకు ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ సమీపంలో నిర్మించ తలపెట్టిన ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖారారు చేసింది. శుక్రవారం నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఖరారు చేశారు.

100 ఎకరాల స్థలంలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు. ఈ 100 ఎకరాల్లో 5 ఎకరాలను బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థకు ఉచితంగా కేటాయిస్తారు. మరో 5 ఎకరాలను ఇతర ప్రభుత్వ ఎజెన్సీలకు మార్కెట్‌ రేటుపై కేటాయిస్తారు.

ఒక అయిదెకరాల స్థలాన్ని మాత్రం బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ పరిశోధనా సంస్థకు ఎకరా లక్షరూపాయల సబ్సిడీ రేటుతో విక్రయిస్తారు.కాగా షామిర్‌పేట వద్ద తుర్కపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన బయోటెక్‌ పార్క్‌ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును ప్రభుత్వం ప్రముఖ కాంట్రాక్టింగ్‌ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ
కంపనీకి అప్పగించాలని నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X