వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు బిజెపి ఉచితసలహాలు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్‌ః 14వ విడత జన్మభూమి అనుభవాలను దృష్టిలో వుంచుకొనిదీనిని సక్రమంగా అమలు చేసేందుకు ఒక కార్యాచరణపథకం రూపొందించాలని బిజెపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూచించింది. జన్మభూమి,భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులపై తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి కొన్ని ఆసక్తికరమైన సూచనలు చేసింది. రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికె. విద్యాసాగర్‌ రావు, పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ శనివారం హైదరాబాద్‌ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
జన్మభూమి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఇందులో ప్రజలు పూర్తిగాభాగస్వాములు కాలేకపోతున్నారని బిజెపిఅభిప్రాయపడింది.

ప్రజలను పూర్తి స్థాయిలో జన్మభూమిలో భాగస్వాములనుచేసేందుకు తక్షణం ఒక కార్యాచరణ ప్రణాళికనురూపొందించాలని, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని విద్యాసాగర్‌ రావు ఈ సందర్భంగాసూచించారు. జన్మభూమిలో మానవ హారాలను ఏర్పాటుచేసేందుకు పాఠశాల విద్యార్థులను వినియోగించడం తగదని బిజెపి అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన జన్మభూమి చివరి రోజు నిర్వహించినమానవహారం సందర్భంగా వేలాది మందివిద్యార్థులను గంటల తరబడి ఎండలో నిలబెట్టడం పట్ల పెద్దఎత్తున విమర్శలు చెలరేగిన విషయం విదితమే. ఇటువంటిచేదు అనుభవాలు ఆ చిన్నారులు హృదయాలను కలచి వేస్తాయని విద్యాసాగర్‌ రావు అన్నారు.

పేదరిక నిర్మూలనకే భాగస్వామ్య నిధులు
భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వసమీకరించే నిధులను సమాజంలో పేద,ధనిక వర్గాల మధ్య వున్న అంతరాన్ని తొలగించేందుకువినియోగించాలని విద్యాసాగర్‌ రావు సూచించారు. ఒకవైపుఖజానాలో పైసా లేదంటూనే శిఖరాగ్ర సదస్సు కోసం ఇలా కోట్లు ఖర్చుపెట్టడం విచిత్రంగా వున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

చేతి వృత్తుల వారు, మహిళలకు ఉపయోగపడేవిధంగా ప్రభుత్వం ఎం.ఒ.యులు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.జన్మభూమిపైన, భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సుపైనా బిజెపి వేడిగా వాడిగా చేసిన వ్యాఖ్యలుఅధికార తెలుగుదేశం పార్టీకి, మిత్రపక్షమైన బిజెపికి మధ్య మరో వివాదానికి కారణం కాగలవనిరాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X