వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుదుబాయ్‌ పయనం

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్‌ః అభివృద్ధి, సహకారంపైదుబాయ్‌ లో జరిగే అంతర్జాతీయ సదస్సులోపాల్గొనేందుకు చంద్రబాబునాయుడు సారధ్యంలోని ఉన్నత స్థాయిబృందం శనివారం బయలుదేరి వెళుతున్నది. ఈ ఉన్నతస్థాయి బృంతంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కోటగిరి విద్యాధర రావు, ముఖ్యమంత్రి ఐ.టి. సలహాదారు రణదీప్‌ సూడాన్‌ తదితరులు వున్నారు. ఈ బృందంహైదరాబాద్‌ నుంచి ముంబయ్‌ చేరుకొని అక్కడినుంచి ఆదివారం వేకువ జామున దుబాయ్‌బయలుదేరి వెళుతుంది.
17వ తేదీ ఉదయం చంద్రబాబు నాయుడుహైదరాబాద్‌ తిరిగి వస్తారు.

దుబాయ్‌ పర్యటన సందర్భంగా అభివృద్ధిసహకారంపై జరిగే సదస్సులో ఇ-గవర్నెన్స్‌ పైచంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం చంద్రబాబును దుబాయ్‌ లోని తెలుగు సంఘాలు సత్కరిస్తాయి. ఆ తరువాతఆయన దుబాయ్‌ ప్రిన్స్‌ ను కులుసుకుంటారు.దుబాయ్‌ లోని వివిధ పరిశ్రమలు ముఖ్యంగాఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోని వివిధ సంస్థలనుచంద్రబాబు సందర్శిస్తారు.

గత మే నెలలో దుబాయ్‌ బృందంహైదరాబాద్‌ వచ్చిన సందర్భంగాపెట్టుబడులకు సంబంధించి జరిగిన చర్చలనుచంద్రబాబు ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశాలువున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X