• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌ః భారతదేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం ప్రభంజనవేగంతో విస్తరించనున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు వెల్లడించారు. భారతదేశంలో అనతి కాలంలో 50మిలియన్‌ ఐ.టి. ఉద్యోగాలురానున్నాయంటూ టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించినవ్యాసంలోని వాక్యాలను ఆయన ఉటంకించినప్పుడుదుబాయ్‌ లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌డవలప్‌ మెంట్‌ సదస్సు హర్షధ్వానాలతోమారుమోగి పోయింది.

By Staff
|

దుబాయ్‌ లోమంగళవారం జరిగిన ఒ.ఇ.సి.డి. సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఇ-గవర్నెన్స్‌ పై కీలకోపన్యాసం చేశారు. దుబాయ్‌యువరాజు షేక్‌ సుల్తాన్‌ బిన్‌ ఖలీఫా అల్‌ నహయాన్‌ తోసహా 60 దేశాలకు చెందిన 460 మందిప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఇ-గవర్నెన్స్‌ పై చంద్రబాబు ఇచ్చిన వీడియోప్రజెంటేషన్‌ సదస్సులో పాల్గొన్న వారిని సంభ్రమాశ్చర్య చకితుల్నిచేసింది.

ఐ.టి సహకారంతోపేదరిక నిర్మూలనకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న వివిధపథకాలను చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగావివరించారు. ఇ-గవర్నెన్స్‌, డిస్టెంట్‌ లెర్నింగ్‌,టెలిమెడిసిన్‌, ఇ-కామర్స్‌ రంగాలపై తన ప్రభుత్వం ప్రత్యేకంగాదృష్టి సారించిందని ఆయన చెప్పారు. సువిశాల భారతదేశంలో అతి తక్కువ వ్యయంతో ప్రభుత్వసమాచారాన్ని, అభివృద్ధి పథకాలను ప్రజలకుఅందించడం ఇంటర్నెట్‌ ద్వారా మాత్రమే సాధ్యమనిఆయన చెప్పారు.

మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యూనిఫైడ్‌ పోర్టల్‌ ను ప్రారంభించనున్నదని ఆయన వివరించారు. గ్రామాలు,మండలాలు, డివిజన్లు, జిల్లాలు, రాజధానికిదశల వారీగా నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లుఆయన వివరించారు. త్వరలో రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు సైతం ఇంటర్నెట్‌సౌకర్యం కల్పించనున్నట్లు చంద్రబాబు స్పష్టంచేశారు. స్మార్ట్‌ గవర్నమెంట్‌ పేరిట భూరికార్డులు, తదితర ప్రజావసరాలకుసంబంధించిన పూర్తి సమాచారాన్నికంప్యూటరీకరించామని, ఈ పథకానికి ఎంతో ఆదరణ లభించిందనిఆయన చెప్పారు. ఆధునుక యుగంలో అభివృద్ధిసాధనకు ఐ.టి.కి మించిన శక్తివంతమైనఆయుధం మరొకటి లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.

చంద్రబాబుకుఅభినందనల వెల్లువ

చంద్రబాబు వీడియోప్రజెంటేషన్‌ పూర్తయిన వెంటనే సదస్సు జరుగుతున్నసువిశాలమైన ఆడిటోరియం కరతాళ ధ్వనులతోమారుమోగింది. ప్రజెంటేషన్‌ ముగిసినవెంటనే అంతా లేచి నిలబడి చంద్రబాబును కరతాళధ్వనులతో అభినందించారు. యువరాజు నహయన్‌స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చిఅభినందనలు తెలిపారు. పలు దేశాలకుచెందిన ప్రతినిధులు తమ దేశానికిరావలసిందిగా చంద్రబాబును ఆహ్వానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more