• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుస్థిరప్రభుత్వంతోనే సంస్కరణలు

By Staff
|

హైదరాబాద్‌:సంస్కరణలు సమర్ధంగా అమలు చేసిప్రజలు వాటి ఫలితాలను అందుకోవాలంటేసుస్థిర ప్రభుత్వం వుండాలని చైనా నేతలీపెంగ్‌ చెప్పారు. ప్రభుత్వం సుస్థిరంగా వుంటేనేసంస్కరణలను అర్ధవంతంగా అమలుచేసి వాటినుంచితగిన ఫలితాలను రాబట్టవచ్చని ఆయనచెప్పారు. బుధవారం నాడు హైదరాబాద్‌పర్యటన సందర్భంగా హైటెక్‌ సిటీనిసందర్శించిన లీపెంగ్‌ అక్కడే ఏర్పాటయనిసమావేశంలో ప్రసంగించారు. చైనా గత కొన్నిసంవత్సరాలుగా అమలు చేస్తున్నసంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయనచెప్పారు. తమ సంస్కరణలకు మూడులక్ష్యాలు వున్నాయని ఆయన చెప్పారు.

ఆహారధాన్యాల్లోస్వయం సమృద్ధి, జీడీపీలో సక్రమ వృద్ధి,వచ్చే పదేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు7 శాతానికి తగ్గకుండా వుండేలా జాగ్రత్త పడటంతమ ప్రధాన లక్ష్యాలని ఆయన చెప్పారు. ఈలక్ష్యాల్లో తొలి రెండు లక్ష్యాలను ఇప్పటికేసాధించామని ఆయన చెప్పారు. మూడో లక్ష్యాన్నికూడా చైనా అలవోకగా సాధించగలదన్నధీమా ఆయన వ్యక్తం చేశారు. వ్యవసాయానికిఅగ్రస్థానం ఇవ్వడం వల్ల సుస్థిరఆర్ధికవ్యవస్థను సాధించగలిగామని అందువల్లసంస్కరణలను కూడా తాము తేలిగ్గా అమలుచేయగలిగామని ఆయన వివరించారు.ప్రపంచంలో రెండు పెద్ద దేశాలైనభారత్‌-చైనా పరస్పర సహకారంతో ముందుకుసాగాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి తమప్రజంటేషన్‌లో స్వల్పకాలంలో శరవేగంతోఅభివృద్ధి సాధించిన చైనాను అభినందించారు.చైనా బాటలోనే తాము కూడా ముందుకుసాగుతున్నట్టుగా చెప్పారు. ఐటి అభివృద్ధికికావల్సిన మౌలిక వసతులన్నీ తమ దగ్గరవున్నాయని ఆయన వెల్లడించారు. ఈసమావేశంలో మంత్రులు, అధికారులతో పాటుసిపిఐ, సిపిఎం వంటి ప్రతిపక్షాల నేతలు కూడాపాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more