వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా ముఠాల ఆటకట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరాష్ట్రంలో మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ప్రత్యేకచట్టాన్ని తీసుకు వస్తున్నట్లు రాష్ట్రం హోం శాఖ మంత్రిదేవేందర్‌ గౌడ్‌ ప్రకటించారు. గతంలో వున్నచట్టాల్లో లొసుగులను సవరించి పకడ్బందీగారూపొందించిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు దేవేందర్‌ గౌడ్‌బుధవారం విలేకర్ల సమావేశంలోవెల్లడించారు.

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ మొదలు కొని కాంట్రాక్టులవరకు అన్ని రంగాలలో మాఫియా ముఠాలు విస్తరించివున్నాయని, వీటిని అరికట్టకపోతే సామాజిక న్యాయంకరవై పోతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సామాన్యలు న్యాయం ప్రస్తావన ఎత్తలేని పరిస్థితులు ఈ మాఫియా ముఠాలవల్ల కలుగుతున్నాయని, ఈ ప్రగతి నిరోధక శక్తులఆటకట్టించేందుకే చట్టాన్ని రూపొందించనట్లుఆయన వివరించారు.

మాఫియా నిరోధక చట్టం వల్ల మానవహక్కులకు భంగం కలుగుతుందనేవాదనలో అర్థం లేదని, వాస్తవానికి మానవహక్కుల పరిరక్షణ జరుగుతుందని దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X