• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బద్ధకిస్తేశిక్ష: అధికారులకు బాబు హెచ్చరిక

By Staff
|

హైదరాబాద్‌:ప్రభుత్వంలో చురుకుగా పని చేయని అధికారులనుశిక్షించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుచెప్పారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో గురువారం ఏర్పాటయిన జన్మభూమి సూపర్‌వైజర్ల వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. ఆవర్క్‌షాప్‌లో 80 మంది సీనియర్‌ అధికారులుపాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమంలో చురుకుగా పనిచేయని అధికారులను శిక్షించేందుకు వీలైనయంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం వున్నదనిఆయన అన్నారు.

ఇటీవలి రైతు జన్మభూమివైఫల్యాలను అంచనా వేసుకుని రానున్న జన్మభూమి కార్యక్రమాన్నిపకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం వున్నదనిఆయన అభిప్రాయపడ్డారు. రైతు జన్మభూమిలోఅధికారులు విఫలం కావడం వల్ల ప్రజలకు ఈ కార్యక్రమంపెద్దగా స్ఫూర్తిని ఇవ్వలేకపోయిందని ఆయనఅన్నారు.

అధికారులు జన్మభూమి కార్యక్రమంఅమలుపై సరైన అంచనాలు అందివ్వడం లేదని,నివేదికలు సృజనాత్మకంగా వుండడం లేదని, సరిగాఅంచనా వేయలేకపోతే జన్మభూమి ఫలితాలుఇవ్వదని ఆయన అన్నారు. చేపట్టే కార్యక్రమాలు సామాన్యమానవుడికి అర్థమయ్యే రీతిలో వున్నప్పుడే సత్ఫలితాలుఇస్తాయని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్నిమరో స్వాతంత్ర్య పోరాటంలా ముందుకు నడిపించాలనిఆయన కోరారు. డ్వాక్రా సత్ఫలితాలు ఇస్తున్న విషయాన్నిఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సబ్సిడీలు లేచిచోట వనరుల సేకరణ విధానాలపై అధికారులుదృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X