• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిమెంట్‌ ధరలపై సిఎం ఆందోళన

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలో సిమెంట్‌ ధరల పెంపు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రులతో శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన సిమెంట్‌ ధరల పెంపుపై మాట్లాడారు. అవసరమైతే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సిమెంట్‌ను దిగుమతి చేసుకుని ధరలు తగ్గేలా చూస్తామని ఆయన అన్నారు.

సిమెంట్‌ ఉత్పత్తిదారులు కుమ్మక్కయి ధరలు పెంచేశారని, రెండు, మూడు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపినా ధరల తగ్గింపునకు వారు ముందుకు రాలేదని ఆయన అన్నారు. దిగుమతి చేసుకుంటే ధరలు తగ్గుతాయని, అప్పుడు సిమెంట్‌ ఉత్పత్తి దారులు దిగి రాక తప్పదని ఆయన అన్నారు.

సిమెంట్‌ ధరల పెంపు వల్ల ప్రభుత్వ భవనాల, రోడ్ల నిర్మాణాలు స్తంభించిపోయాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కొన్ని శాఖల్లో సిమెంట్‌ నిల్వలున్నాయని, వాటిని విడుదల చేసి పనులు కొనసాగించాలని ఆయన మంత్రులకు సూచించారు. దుబాయ్‌ పర్యటనలో వున్న భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధరరావు తిరిగి రాగానే సిమెంట్‌ ఉత్పత్తిదారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. సిమెంట్‌ దిగుమతి విషయంపై కూడా చర్చించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుందామని ఆయన మంత్రులతో అన్నారు.

అక్రమ సారాను అరికట్టడానికి దాడులు విస్తృతం చేయించాలని ఆయన ఆబ్కారీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించారు.వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలపై సవివరమైన నివేదికను సమర్పించాలని ఆయన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కోరారు. వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన మంత్రులను కోరారు. గోదావరి నదిపై తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఫిబ్రవరి రెండవ వారంలో శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more