• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దాడులు కొనసాగితే చర్చలు అసాధ్యం

By Staff
|

ఉడుపి (కర్ణాటక): తీవ్రవాదుల దాడులు ఇదే విధంగా కొనసాగితే పాకిస్థాన్‌తో అర్థవంతమైన చర్చలు జరపడం సాధ్యం కాదని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఇక్కడికి వచ్చిన ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థల చర్యలను ఖండించడం, వాటి దూకుడుకు కళ్లెం వేయడం ద్వారా చర్చల పట్ల పాక్‌ తన చిత్తశుద్ధిని, నిబద్ధతను రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించే బాధ్యత పూర్తిగా పాక్‌పైనే వున్నదని ఆయన చెప్పారు.

పాకిస్థాన్‌తో అత్యున్నత స్థాయి చర్చలతో సహా అన్ని స్థాయిల్లో చర్చలు జరపడానికి భారత్‌ సిద్ధంగా వున్నదని ఆయన అన్నారు. చర్చలు ప్రారంభమైతే హింసాకాండ అదే ఆగుతుందన్న పాక్‌ వాదన పట్ల ఆయన ఆశ్చర్య ప్రకటించారు. భారత్‌ గానీ, అంతర్జాతీయ సమాజం గానీ ఈ వాదనతో ఏకీభవించవని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రవాదుల చర్యల వల్ల పాక్‌, భారత్‌ల మధ్చ చర్చ పునఃప్రారంభానికి విఘాతం ఏర్పడిందని ఆయన అన్నారు.

భద్రతా దళాలపైన, పౌరులపైన తీవ్రవాదుల దాడుల సంఖ్య, తీవ్రత కూడా పెరిగాయని, ఎర్రకోట, శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుల వద్ద జరిగిన సంఘటనలు, ప్రధాని కార్యాలయంపై దాడి చేస్తామన్న హెచ్చరికల వంటివాటిని చూస్తుంటే భారత్‌, పాక్‌ల మధ్య చర్చలు జరిగే అవకాశాల పట్ల తీవ్రవాద సంస్థలు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.

చర్చలకు అనువైన వాతావరణం కల్పించడానికి భారత్‌ గట్టి నిబద్ధతను ప్రదర్శించిందని, విశ్వాస కల్పనకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుందని, జమ్మూ కాశ్మీర్‌లో ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. కాశ్మీర్‌లోను, వెలుపల తీవ్రవాదుల చర్యలు కొనసాగుతుండడాన్ని బట్టి ఈ ఏకపక్ష చర్యల ప్రయోజనం నెరవేరడం లేదనిపిస్తోందని ఆయన ఆయన అన్నారు.

భారత్‌ అగ్ని-2 క్షిపణి ప్రయోగం వల్ల ఏ పొరుగు దేశానికీ ఏ విధమైన ముప్పు లేదని ఆయన అన్నారు. ఇది పూర్తిగా ఆత్మరక్షణకు ఉద్దేశించిందేనని ఆయన విలేకరులకు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more