వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంపైవిపక్షం దాడిః సభలో రభస Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అధికారతెలుగుదేశం పార్టీ ఉపఎన్నికలలో అక్రమాలకు,అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదంటూకాంగ్రెస్‌, వామపక్షాలు శుక్రవారం అసెంబ్లీని గంటసేపు స్తంభింపచేశాయి. తెలుగుదేశం పార్టీ అక్రమాలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించాల్సిందిగా సభ ప్రారంభంకాగానే కాంగ్రెస్‌, వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.అందుకు స్పీకర్‌ ప్రతిభా భారతి నిరాకరించడంతో రభసప్రారంభమైంది.

కాంగ్రెస్‌, వామపక్ష సభ్యుల ఆరోపణలు,తెలుగుదేశం సభ్యుల ప్రత్యారోపణలతో సభ గంటసేపుఅట్టుడికి పోయింది. ప్రశ్నోత్తరాల సమయం స్తంభించిపోయింది. పరిస్థితిలో ఎంతసేపటికీ మార్పు రాకపోవడంతో సభనుఅరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ప్రకటించారు. ఆ తరువాత అన్ని పార్టీల నేతలతోచర్చించిన స్పీకర్‌ ఈ అంశంపై శనివారం వాయిదా తీర్మానాన్నిప్రవేశపెట్టేందుకు ప్రతిభా భారతి అనుమతించారు.

ఉపఎన్నికల వ్యవహారం సభలోచర్చించేందుకు వీలు లేదని శాసనసభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడువివరించారు. ఈ అంశాన్ని వేరే విధంగాప్రస్తావించాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని యధావిధాగాసాగనివ్వాలని స్పీకర్‌ చేసిన అభ్యర్థనలను సభ్యులుపట్టించుకోలేదు. వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందేనంటూ పట్టు పట్టారు.

అందుకు ప్రతిభా భారతి సమ్మతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులుపోడియం వద్దకు దూసుకు వెళ్ళి దినపత్రికలలోతెలుగుదేశం అధికార దుర్వినియోగానికిసంబంధించిన వార్తలను స్పీకర్‌ కు చూపుతూనిరసన వ్యక్తం చేశారు. కొంత సేపు మౌనంగావున్న తెలుగుదేశం సభ్యులు కూడా ఆ తరువాత రంగంలోకిదిగారు. ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడిచేశారు. దీనితో సభ గంటసేపు అట్టుడికిపోయింది. దీనితో సభను కొద్ది సేపు వాయిదా వేస్తున్నట్లు ప్రతిభా భారతిప్రకటించారు.

అన్ని పార్టీల నేతలతోస్పీకర్‌ భేటీః
శాసనసభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకుసహకరించాల్సిందిగా స్పీకర్‌ ప్రతిభాభారతిఅన్ని పార్టీల నేతలను కోరారు. అసెంబ్లీని కొద్ది సేపువాయిదా వేసిన స్పీకర్‌ ఆ తరువాత తన ఛాంబర్‌లో అధికార, ప్రతిపక్ష నేతలతో సమావేశంజరిపారు. కీలకమైన ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధాచేయవద్దని ఆమె సభ్యులకు విజ్ఞప్తిచేశారు. తమ వాయిదా తీర్మానాలనుఅనుమతించాల్సిందేనని కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు పట్టుపట్టడంతోస్వల్ప మార్పులతో ఆ తీర్మానాలను శనివారం సభలోప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ అనుమతించారు.అరగంట విరామం తరువాత ప్రారంభమైన అసెంబ్లీ కార్యక్రమాలుయధావిధిగా సాగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X