వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: టిడ్కో ముడుపుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా నమోదైన కేసులో న్యాయవిచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని శుక్రవారం నాడు ఆదేశించింది.

టిడ్కో జారీ చేసిన బాండ్లలో కోట్లాది రూపాయలమేరకు అవకతవకలు జరిగిన ఆరోపణతో జయపై కేసులు నమోదైన విషయం విదితమే. అయితే మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలపై ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుపై విచారణను నిలిపివేసింది.

అయితే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పు మేరకు ఈ కేసుపై మళ్లీ విచారణను ప్రత్యేక న్యాయస్థానం ప్రారంభిస్తుంది. శరవేగంతో మారుతున్న తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరోసారి సంచలనాలకు వేదిక కానున్న తరుణంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు జయకు ఎదురదెబ్బ కాగా ఆమె ప్రత్యర్ధిపార్టీ నేత కరుణానిధికి గొప్ప ఊరట అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X