• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారీ పేలుడు పదార్థాలుస్వాధీనం

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం పెద్ద యెత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా నిల్వ వుంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 2,050 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, ఫ్యూజ్‌ వైర్‌ బండిళ్లు, 4,312 జిలెటిన్‌ స్టిక్స్‌తో పాటు ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ పేర్వారం రాములు ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ జిల్లా చిన్నోనిగూడెం గ్రామానికి చెందిన ఎస్‌. ముత్యాలు అలియాస్‌ ముత్తయ్య ఆరేళ్ల కిందట ఇక్కడి ఫిలింనగర్‌లో స్థిరపడ్డాడు. రెండేళ్లుగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి నివాసి మహ్మద్‌ యూసుఫ్‌ వద్ద పేలుడు పదార్థాలను అక్రమంగా కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. నిరుడు ముత్తయ్యను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి పెద్ద మొత్తంలో పేలుగు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలంగా మళ్లీ ముత్తయ్య పేలుడు పదార్థాలను విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అతని ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X