వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం 2001-2002 సంవత్సరానికి మంగళవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ బడ్జెట్‌ అవాస్తవాల పుట్టఅని కాంగ్రెస్‌ విమర్శించగా, చర్వితచర్వణంగా చెప్పిందే చెప్పుతూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పడం తప్ప పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి నిర్థిష్టమైన కాలవ్యవధిని ప్రభుత్వం ప్రకటించలేకపోయిందని బీజేపీ విమర్శించింది. బడ్జెట్‌ ప్రాధన్యతలను సరిగ్గా నిర్వచించలేకపోయిందని, అసలైన ప్రాధాన్యతలను విస్మరించిందని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిన విషయాన్ని ఈ బడ్జెట్‌ చెప్పకనే చెబుతన్నదని వైఎస్‌ అన్నారు. ఆర్ధిక మంత్రి యనమల ఈ బడ్జెట్‌ను అసత్యాలు, అర్ధ సత్యాలతో నింపారని దుయ్యబట్టారు. పేద ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్రం అందించే నిధులన్నింటిని తమవిగా క్లయిమ్‌ చేసుకున్న ఈ బడ్జెట్‌లో కొత్తదనం లేశమాత్రం కూడా లేదని వైఎస్‌ పేర్కొన్నారు. కాగా ఇంతచేస్తాం, అంతచేస్తామనే అట్టహాసమైన ప్రకటనలే తప్ప బడ్జెట్‌లో వుండాల్సిన నిర్థిష్టప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో లేవని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టుకు ఖచ్చితంగా ఎంత కేటాయిస్తున్నది, ఎంత కాలంలో పూర్తి చేయదల్చుకున్నది చెప్పకుండా విధాన పత్రంలా బడ్జెట్‌ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది జీరో బేస్డ్‌ బడ్జెట్‌ పేరుతో ప్రయోగం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏడాది చేతులెత్తేసిందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. పదవిన్యాసం తప్ప ఈ బడ్జెట్‌లో ఏమీలేదని పేద ప్రజలపై దొడ్డిదారిన భారీ ఎత్తున భారం వేశారని వామపక్షాలు దుయ్యబట్టాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికత్సకు వచ్చే పేదప్రజలపై యూజర్‌ చార్జీల పేరిటి సుంకాలను వడ్డించడాన్ని వామపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని ఆ పార్టీలు పేర్కొన్నాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం 2001-2002 సంవత్సరానికి మంగళవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

ఈ బడ్జెట్‌ అవాస్తవాల పుట్టఅని కాంగ్రెస్‌ విమర్శించగా, చర్వితచర్వణంగా చెప్పిందే చెప్పుతూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పడం తప్ప పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి నిర్థిష్టమైన కాలవ్యవధిని ప్రభుత్వం ప్రకటించలేకపోయిందని బీజేపీ విమర్శించింది.

బడ్జెట్‌ ప్రాధన్యతలను సరిగ్గా నిర్వచించలేకపోయిందని, అసలైన ప్రాధాన్యతలను విస్మరించిందని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిన విషయాన్ని ఈ బడ్జెట్‌ చెప్పకనే చెబుతన్నదని వైఎస్‌ అన్నారు. ఆర్ధిక మంత్రి యనమల ఈ బడ్జెట్‌ను అసత్యాలు, అర్ధ సత్యాలతో నింపారని దుయ్యబట్టారు. పేద ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్రం అందించే నిధులన్నింటిని తమవిగా క్లయిమ్‌ చేసుకున్న ఈ బడ్జెట్‌లో కొత్తదనం లేశమాత్రం కూడా లేదని వైఎస్‌ పేర్కొన్నారు.

కాగా ఇంతచేస్తాం, అంతచేస్తామనే అట్టహాసమైన ప్రకటనలే తప్ప బడ్జెట్‌లో వుండాల్సిన నిర్థిష్టప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో లేవని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టుకు ఖచ్చితంగా ఎంత కేటాయిస్తున్నది, ఎంత కాలంలో పూర్తి చేయదల్చుకున్నది చెప్పకుండా విధాన పత్రంలా బడ్జెట్‌ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.

గత ఏడాది జీరో బేస్డ్‌ బడ్జెట్‌ పేరుతో ప్రయోగం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏడాది చేతులెత్తేసిందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. పదవిన్యాసం తప్ప ఈ బడ్జెట్‌లో ఏమీలేదని పేద ప్రజలపై దొడ్డిదారిన భారీ ఎత్తున భారం వేశారని వామపక్షాలు దుయ్యబట్టాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికత్సకు వచ్చే పేదప్రజలపై యూజర్‌ చార్జీల పేరిటి సుంకాలను వడ్డించడాన్ని వామపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని ఆ పార్టీలు పేర్కొన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X