వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ లోటుతో ఆంధ్రబడ్జెట్‌ Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పన్ను పోట్లు ఏమీ లేకుండా, ప్రభుత్వవ్యయ నియంత్రణలను ఎత్తివేస్తూఉదారవాద బడ్జెట్‌ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రియనమల రామకృష్ణుడు మంగళవారంప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య 2001-2002సంవత్సరానికి అసెంబ్లీలో ఆయన బడ్జెట్‌ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ లో నీటిపారుదల రంగానికి ప్రభుత్వంపెద్దపీట వేసింది. రెవెన్యూ లోటు భారీగానేవుంది. రెవెన్యూ లోటు 3,887 కోట్లు రూపాయలువుండగా, నికర లోటు 145 కోట్ల రూపాయలుగా వున్నట్లుయనమల వెల్లడించారు.

సాగునీటి పారుదలకు 3,294 కోట్లరూపాయలు, గ్రామీణ నీటి పారుదలకు 2,313 కోట్లరూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ రంగానికి ప్రభుత్వం 597 కోట్లురూపాయల నిధులను బడ్జెట్‌ లోకేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్నపథకాలతో పాటు అన్ని పథకాలను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి వున్నదనియనమల చెప్పారు.

ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగాగుర్తించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామనియనమల వివరించారు. ఈ ప్రాజెక్టుల కారణంగానిర్వాసితులయ్యే వారికి పునవారావాస సౌకర్యాలు కల్పించడానికిబడ్జెట్‌ లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టంచేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లుయనమన వెల్లడించారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థలేనిదే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదనిఆయన అభిప్రాయపడ్డారు. ప్రణాళికేతర వ్యయాన్నినియంత్రిస్తామని, ప్రభుత్వ వ్యయంపై ఇప్పటివరకు వున్న ఆంక్షలను కొతమేరకు సడలిస్తామనియనమల వెల్లడించారు.

బడ్జెట్‌ ముందుగానే లీక్‌!
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించినబడ్జెట్‌ ముందుగానే పత్రికలకు లీక్‌ అయిందనిమజ్లిస్‌ సభాపక్ష నాయకుడు అసదుద్దీన్‌ఒవైసీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌వారు కూడా ఆయనతో గొంతు కలపడంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. బడ్జెట్‌ వివరాలను ఆర్థిక శాఖసిబ్బంది ముందుగానే పత్రికలకు లీక్‌ చేశారంటూఅసదుద్దీన్‌ ధ్వజమెత్తారు. గతంలో ఇలా జరిగినప్పుడు ఎన్టీఆర్‌ 33మంది మంత్రులకుఉద్వాసన చెప్పారని, చెన్నారెడ్డి సర్కార్‌ హయాంలోఆయన ప్రెస్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశారని అసద్‌చెప్పారు.

ఈ వ్యవహారంపై విచారణజరిపి, సభకు పూర్తి వివరాలు తెలియజేస్తాననియనమల హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X