• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2001-2002 సంవత్సరానికి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, అప్పుల పై మన రాష్ట్రం ఎలా ఆధారపడి వున్నదో స్పష్టం చేసింది. అప్పులు తేనిదే పూట గడవడం అసాధ్యం అన్నస్థితికి రాష్ట్రం చేరుకున్న విషయాన్ని యనమల తమ బడ్జెట్‌లో బయటపెడుతునే అందమైన పదాలతో ఈ నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధికరంగ వ్యూహపత్రంలోనే రాష్ట్రంలో ఏ వ్యవహారం ముందుకు సాగాలన్నా అప్పులు తేకతప్పదన్న పరిస్థితి వుందని స్పష్టం చేశారు. అదే విషయం మరోసారి బడ్జెట్‌లో కూడా బయటపెట్టారు. రాష్ట్రానికి పన్నుల వాటాలో భాగంగా కేంద్రం నుంచి అందే మొత్తం4416 కోట్ల రూపాయలు వుండగా అంతకంటే వెయ్యికోట్ల రూపాయలు అదనంగా అప్పుల కింద చెల్లించాల్సిన పరిస్థితి వుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జీతభత్యాలు చెల్లిస్తూ నిర్ణయించిన కార్యక్రమాలకు కేటాయింపులు సరిగ్గా జరపాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి లెండింగ్‌ ఎజెన్సీలనుంచి కనీసం 8429 కోట్ల రూపాయల మొత్తం రుణంగా తీసుకోక తప్పదని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడే తన బడ్జెట్‌ పత్రంలో వివరించారు.అప్పులనే ఆలంబనగా చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడింపించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలను తెస్తుందో చూడాల్సివున్నదని నిపుణులు అంటున్నారు.అదే సమయంలో ఈ బడ్జెట్‌లో మొదటిసారిగా ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సర్వీసులకు వినియోగచార్జీలను వసూలు చేయనున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు కొత్తగా పన్నుల భారం వేయమని చెబుతునే గడుసుగా మరోదారిలో ఈ వినియోగ చార్జీలను ప్రతిపాదించడం గమనార్హం.

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2001-2002 సంవత్సరానికి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, అప్పుల పై మన రాష్ట్రం ఎలా ఆధారపడి వున్నదో స్పష్టం చేసింది. అప్పులు తేనిదే పూట గడవడం అసాధ్యం అన్నస్థితికి రాష్ట్రం చేరుకున్న విషయాన్ని యనమల తమ బడ్జెట్‌లో బయటపెడుతునే అందమైన పదాలతో ఈ నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధికరంగ వ్యూహపత్రంలోనే రాష్ట్రంలో ఏ వ్యవహారం ముందుకు సాగాలన్నా అప్పులు తేకతప్పదన్న పరిస్థితి వుందని స్పష్టం చేశారు. అదే విషయం మరోసారి బడ్జెట్‌లో కూడా బయటపెట్టారు.

రాష్ట్రానికి పన్నుల వాటాలో భాగంగా కేంద్రం నుంచి అందే మొత్తం
4416 కోట్ల రూపాయలు వుండగా అంతకంటే వెయ్యికోట్ల రూపాయలు అదనంగా అప్పుల కింద చెల్లించాల్సిన పరిస్థితి వుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జీతభత్యాలు చెల్లిస్తూ నిర్ణయించిన కార్యక్రమాలకు కేటాయింపులు సరిగ్గా జరపాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి లెండింగ్‌ ఎజెన్సీలనుంచి కనీసం 8429 కోట్ల రూపాయల మొత్తం రుణంగా తీసుకోక తప్పదని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడే తన బడ్జెట్‌ పత్రంలో వివరించారు.

అప్పులనే ఆలంబనగా చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడింపించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలను తెస్తుందో చూడాల్సివున్నదని నిపుణులు అంటున్నారు.అదే సమయంలో ఈ బడ్జెట్‌లో మొదటిసారిగా ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సర్వీసులకు వినియోగచార్జీలను వసూలు చేయనున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు కొత్తగా పన్నుల భారం వేయమని చెబుతునే గడుసుగా మరోదారిలో ఈ వినియోగ చార్జీలను ప్రతిపాదించడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X