• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాల్పుల విరమణను పొడగించాలా లేకా విరమించాలా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని వాజ్‌పేయి మంగళవారం రాత్రి నిర్ణయించినట్టుగా తెలిసింది.కాశ్మీర్‌ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం జరపాలని బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, అకాలీదళ్‌ కూడా డిమాండ్‌చేస్తుండటంతో ప్రభుత్వం ఇరుకున పడింది. కాశ్మీర్‌లో పొడగించిన కాల్పుల విరమణ కూడా త్వరలోనే ఈ నెల 26తో ముగుస్తున్నది. తొలుత బుధవారం నాడు జరగనున్న జాతీయ భద్రతావ్యవహారాల కేబినెట్‌ కమిటీలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావించింది. అయితే అన్ని పార్టీలతో సంప్రదించకుండా కాశ్మీర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మిత్రపక్షాలనుంచే తీవ్రమైన వత్తిడి వచ్చింది. బుధవారం నాడు ముందుగా ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలతో సమావేశమై చర్చించిన తర్వాత, భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కేవలం ఎన్‌డిఎలోని భాగస్వామ్య పక్షాలతో మిత్రపక్షాలతో మాత్రమే ప్రభుత్వం సమావేశం ఏర్పాటుచేస్తుందా, వామపక్షాలు, కాంగ్రెస్‌, సమాజ్‌వాద్‌ వంటి ఇతర వైరి పక్షాలను కూడా ఆహ్వానిస్తుందా మాత్రం ఇంకా తెలియరాలేదు.

By Staff
|

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాల్పుల విరమణను పొడగించాలా లేకా విరమించాలా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని వాజ్‌పేయి మంగళవారం రాత్రి నిర్ణయించినట్టుగా తెలిసింది.

కాశ్మీర్‌ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం జరపాలని బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, అకాలీదళ్‌ కూడా డిమాండ్‌చేస్తుండటంతో ప్రభుత్వం ఇరుకున పడింది. కాశ్మీర్‌లో పొడగించిన కాల్పుల విరమణ కూడా త్వరలోనే ఈ నెల 26తో ముగుస్తున్నది. తొలుత బుధవారం నాడు జరగనున్న జాతీయ భద్రతావ్యవహారాల కేబినెట్‌ కమిటీలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావించింది.

అయితే అన్ని పార్టీలతో సంప్రదించకుండా కాశ్మీర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మిత్రపక్షాలనుంచే తీవ్రమైన వత్తిడి వచ్చింది. బుధవారం నాడు ముందుగా ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలతో సమావేశమై చర్చించిన తర్వాత, భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాగా కేవలం ఎన్‌డిఎలోని భాగస్వామ్య పక్షాలతో మిత్రపక్షాలతో మాత్రమే ప్రభుత్వం సమావేశం ఏర్పాటుచేస్తుందా, వామపక్షాలు, కాంగ్రెస్‌, సమాజ్‌వాద్‌ వంటి ఇతర వైరి పక్షాలను కూడా ఆహ్వానిస్తుందా మాత్రం ఇంకా తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X