వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుసమస్యలపైదద్దరిల్లిన అసెంబ్లీ Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః నకిలీ విత్తనాల కారణంగానష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశంపై గురువారంఅసెంబ్లీలో తీవ్ర వాదోపవాదాలు, రభస, ప్రతిపక్షాలవాకౌట్లు జరిగాయి. నకిలీ విత్తనాల కారణంగారాష్ట్రంలో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని,వేలాది ఎకరాలలో పంట నష్ట పోయారని, ఇలానష్టపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనికాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ వారి ప్రశ్నలకు రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పిన సమాధానంతోకాంగ్రెస్‌ సభ్యులు సంతృప్తి చెందలేదు.నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటనచేయాలని వారు డిమాండ్‌ చేశారు.

రైతుల సమస్యపై సైతంమాట్లాడేందుకు కాంగ్రెస్‌ వారికి అనుమతి ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్ల్యే జీవన్‌ రెడ్డి కాగితాలుచించేసి, మైక్‌ విరగ గొట్టారు. ఈ చర్యను సభలోవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,స్పీకర్‌ ప్రతిభా భారతి తీవ్రంగా వ్యతిరేకించారు.కాంగ్రెస్‌ వారు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితేసహించేది లేదని చంద్రబాబు నాయుడు తీవ్రస్వరంతో అనడంతో కాంగ్రెస్‌ వారు సైతం నిరసనవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌,తెలుగుదేశం సభ్యుల మధ్య వాదోపదావాలుచోటు చేసుకున్నాయి.

రాష్ట్రంలో రైతులు నకిలీ విత్తనాలఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారని,వారికి నష్టపరిహారం అంశం గురించి వినేందుకు సైతంప్రభుత్వానికి సమయం లేదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీనాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి విమర్శించారు.మైకు బోల్డు ఊడిపోతేనే ఇంతగా బాధపడేచంద్రబాబు నాయుడు గారు రైతులు ఆత్మహత్యచేసుకుంటే స్పందించకపోవడం విచిత్రంగావున్నదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులసమస్యలపై ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగాకాంగ్రెస్‌, సిపిఎం, మజ్లిస్‌ పార్టీలు సభనుంచివాకౌట్‌ చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X