వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొడిగింపునకు పాక్‌మిలిటెంట్లు వ్యతిరేకం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే,పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల ప్రజలు మాత్రం కాల్పులవిరమణ పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. శాంతి సాధనకు కాల్పుల విరమణను ఆశాకిరణంగావారు భావిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్నస్వాతంత్ర్యపోరాటాన్ని తప్పు దోవపట్టించేందుకే భారత ప్రభుత్వం ఏకపక్ష కాల్పులవిరమణను ప్రకటించిందని తహ్రీక్‌-ఉల్‌-ముజాహిదీన్‌ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించాడు.కాశ్మీర్‌లో జరుగుతున్న లాకప్‌ డెత్‌ల నుంచి, బూటకపుఎన్‌కౌంటర్ల నుంచి, అమాయకులను వేధిస్తున్న సంఘటనలనుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే భారత ప్రభుత్వం కాల్పులవిరమణను పొడిగించినందని అతను అన్నాడు.కాశ్మీర్‌లో శాంతి సాధించాలనే చిత్తశుద్ధి భారతప్రభత్వానికి వుంటే ఖైదీలందరినీ విడుదల చేసి సంబంధితపార్టీలతో వివాదంపై చర్చలకు చొరవ చూపాలనిఆయన అభిప్రాయపడ్డాడు.

కాల్పుల విరమణ పొడిగింపునుపాకిస్థాన్‌ అనుకూల అల్‌-ఉమర్‌ ముజాహిదీన్‌ఛీఫ్‌ ముస్తాక్‌ అహ్మద్‌ జర్గార్‌ కూడా వ్యతిరేకించారు. జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతాదళాలపై, వాటి శిబిరాలపై దాడులను ఉధృతం చేస్తామనిఆయన హెచ్చరించారు.

లష్కర్‌-ఎ-తోయిబా, జైస్‌-ఎ-మొహమ్మద్‌, హర్కత్‌-ఉల్‌-ముజాహదీన్‌ఇప్పటికే కాల్పుల విరమణ పొడిగింపును వ్యతిరేకిస్తూ ప్రకటనలుచేశాయి.

ప్రభుత్వం శాంతి సాధన కోసంనిర్దిష్టంగా ముందుకు వస్తే తప్ప ఏకపక్ష కాల్పులవిరమణ పొడిగింపు ఫలితాలు ఇవ్వబోదని ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ వ్యాఖ్యానించింది. కాల్పులవిరమణ పొడిగింపు 53 ఏళ్ల నుంచి నలుగుతున్న కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారంచూపబోదని తాము ఇప్పటికే స్పష్టం చేశామనిహురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌అబ్దుల్‌ గని భట్‌ ఒక వార్తా సంస్థతో అన్నారు.

  • ెమ ఆఖరు వరకు కాల్పుల విరమణ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X