• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అత్యాచారంపై సభలో గగ్గోలు

By Staff
|
హైదరాబాద్‌: నల్లగొండజిల్లాలో గిరిజన మహిళపై సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు అత్యాచారం జరిపిన సంఘటనపై శుక్రవారం నాడు అసెంబ్లీలో దుమారం సృష్టించింది. 304 నిబంధన కింద సభలో రెండు గంటల పాటు జరిగిన చర్చలో పాల్గొన్ని వివిధ పార్టీల సభ్యులు ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు బాధ్యులను గుర్తించలేదని కాంగ్రెస్‌ నాయకుడు పాల్వయి గోవర్ధనరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించి హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ దశలో హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ కలగజేసుకుని మాట్లాడుతూ, సభ్యులు ఏకపక్షంగా విమర్శలకు దిగడం మంచిది కాదని అన్నారు.

కావాలంటే ప్రతిపక్ష సభ్యులు తన చాంబర్‌కు వస్తే సంబంధిత అధికారులను కూడా పిలిపిస్తానని వారి వాదనకూడా సభ్యులు వినాలని అన్నారు. వారి వాదన కూడా విన్న తర్వాత సస్పెన్ష్‌కు పట్టుబడితే అప్పుడు సస్పెండ్‌ చేయడానికి తమకే అభ్యంతరం లేదని ఆయన ఆగ్రహంగా అన్నారు. హోం మంత్రి మాట్లాడిన తర్వాత గొడవసాగుతుండగానే సభను ఈ రోజుకు వాయిదా వేస్తున్నట్టుగా సభాపతి ప్రకటించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more