• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ెదశంవిజయం ప్రజాభిప్రాయం కాదు

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిద్దలూరు, బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొన్నది.

ధనబలం, అధికార బలం ఉపయోగించి ఈ ఎన్నికల్లో అన్నిరకాల అవకతవకలకు, అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలను గృహనిర్బంధంలో వుంచి, కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్డు చేసి తమ అక్రమాలకు అడ్డులేకుండా అధికారపార్టీ నేతలు చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

దళితులను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ రెండు ఉపఎన్నికల్లో ఫలితాలు నిజమైన ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X