• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరీంనగర్‌లో పేలుడు-పదిమంది మృతి Home Full Story

By Staff
|

కరీంనగర్‌ః కరీంనగర్‌ పట్టణంలోనిఅమీర్‌ నగర్‌ లో ఆదివారం మధ్యాహ్నం ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంటివద్ద జరిగిన పేలుడు దుర్ఘటనలో 8 మందిపిల్లలతో సహా పది మంది మరణించారు. కానిస్టేబుల్‌ తో పాటుమరో 12 మందికి నిప్పంటుకొని తీవ్రంగా గాయుపడ్డారు.వీరందరినీ మొదట కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ తరువాతహైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. హెడ్‌ కానిస్టేబుల్‌సయ్యద్‌ యూసఫ్‌ తన ఇంట్లో దాచుకున్నడిటొనేటర్లే ఈ విషాద సంఘటనకు కారణమని పోలీసులుఅనుమానిస్తున్నారు.

యూసఫ్‌ ఇంటి సమీపంలోని ఒకషెడ్డులో అల్యూమినియం పాత్రలనుకరిగిస్తున్నారు. యూసఫ్‌ ఇంటి నుంచి తెచ్చిన ఒకఅల్యూమినియం పాత్రను కరిగించే ప్రయత్నం చేస్తున్నసందర్భంగా పెద్ద ఎత్తున విస్ఫోటం సంభవించింది. కరిగిస్తున్న గిన్నెలన్నీచెల్లాచెదురై పేలుడు శబ్దంతో అక్కడికి పరిగెత్తుకుంటూవచ్చిన చిన్నపిల్లలకు నిప్పంటుకుంది. యూసఫ్‌ కుమారుడుఐదేళ్ళ నిహాల్‌ పేలుడు ధాటికి ఎగిరి పక్కనవున్న మురికికాలువ సమీపంలో పడి మరణించారు.

మొత్తం 12 మంది పిల్లలతోసహా 20 మందికి మంటల కారణంగా తీవ్రగాయాలు కావడంతో అందరినీ కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోఏడుగురు చిన్నారులు మరణించారు. వారిలో యూసఫ్‌ రెండో కుమారుడు కూడా వున్నాడు.మరణించిన చిన్నారులంతా 7 నుంచి 16 ఏళ్ళ లోపువారే. కానిస్టేబుల్‌ యూసఫ్‌ కూడా ఈ దుర్ఘటనలో తీవ్రంగాగాయపడ్డాడు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా మారడంతోఆదివారం రాత్రి వారిని నిమ్స్‌ కు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X