• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సగటు జీవికి ఊరట-సంస్కరణలకు ఊతం

By Staff
|
న్యూఢిల్లీ: రెండో దశ ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టే బడ్జెట్‌గా చెప్పుకుంటూ కేంద్ర ఆర్ధికమంత్రి యశ్వంత్‌సిన్హా బుధవారం నాడు 2001-2002 సంవత్సరానికి వార్షికబడ్జెట్‌ ప్రతిపాదనలను లోకసభలో ప్రవేశపెట్టారు. గత వారం ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే దృష్ట్యా ఈ బడ్జెట్‌లో భారీ ఎత్తున వడ్డనలను ఊహించిన సగటు జీవికి మాత్రం బడ్జెట్‌ ప్రతిపాదనలు కొంతమేర ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. తాజా పన్నుల భారం పెద్దగా లేని ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై తమకు ఆసక్తి వుందని చెప్పుకునే ప్రయత్నం సిన్హా చేశారు.

ఈ ఏడాది బడ్జెట్‌ వ్యయాన్ని 3,75,223 కోట్ల రూపాయలుగా మంత్రి అంచనావేశారు. ప్రణాళిక వ్యయం 100100 కోట్ల రూపాయలు వుండగలదని పేర్కొన్నారు. ప్రత్యక్షపన్నుల్లో ప్రకటించిన రాయితీల వల్ల ఈ ఏడాది నష్టం 5500 కోట్ల రూపాయలు వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకునే చర్యలను తాను ఈ బడ్జెట్‌లోనే ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. విత్తలోటును 116314 కోట్ల రూపాయలతో జీడీపీలో కేవలం 4.7 శాతం మాత్రమే వుంటుందని కూడా సిన్హా పేర్కొన్నారు. గత ఏడాది విత్తలోటు జీడీపీలో 5.1 శాతం వున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు.

ఈ బడ్జెట్‌లో ఆర్ధికమంత్రి సంస్కరణలకు సంబంధించిన పలు కఠినమైన చర్యలను ప్రతిపాదించారు. పీఎస్‌యుల డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌, సర్కారు వ్యయం తగ్గింపు, రెవెన్యూ పెంపు, గ్రామీణాభివృద్దికి సంబంధించిన అనేక ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది చివరిలో 27 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా 12 వేల కోట్లరూపాయల రాబడిని అంచనా వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ 27 సంస్థల్లో విఎస్‌ఎన్‌ఎల్‌,

ఎయిర్‌ ఇండియా, మారుతి ఉద్యోగ్‌ కూడా వున్నాయి. ఆదాయం పన్నుపై గుజరాత్‌ భూకంపం బాధితుల సాయం కోసం విధించిన సర్‌చార్జ్‌ మినహా మిగిలిన సర్‌చార్జ్‌లను ఆయన ఎత్తివేశారు. భూకంపం బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక బాండ్ల జారీకి గుజరాత్‌కు అనుమతినిచ్చారు.

ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. బ్యాంకులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, బ్యాంకింగ్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఎత్తివేయనున్నట్టుగా ప్రకటించారు. విద్యపై రుణాలను సరళతరం చేశారు. గ్రామీణాభివృద్ధిని, వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనే నిందనుంచి తప్పించుకోవడానికా అన్నట్టు ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కూడా సిన్హా ప్రాధాన్యత కల్పించారు. నాబార్డ్‌ పరిధిని విస్తరిస్తున్నట్టుగా చెప్పారు. కిసాన్‌కార్డుల సంఖ్యను హెచ్చిస్తున్నట్టుగా వెల్లడించారు. కిసాన్‌కార్డు హోల్డర్లకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టుగా తెలిపారు.

సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్‌లో సిన్హా 790 కోట్ల రూపాయలు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్‌ కేటాయింపులను 13.8 శాతం హెచ్చించారు. దేశీయ కంపెనీల్లో విదేశీ సంస్థలు 49 శాతం వరకు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి అనుమతి నిచ్చారు. పోస్టల్‌ చార్జీలను స్వల్పంగా హెచ్చిస్తూ ప్రతిపాదన చేశారు. కార్లపై సుంకాలను తగ్గించారు. దిగుమతి చేసుకున్న సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై మాత్రం దిగుమతి సుంకాన్ని మరో 35 శాతం హెచ్చించారు. కొత్త ఆర్ధిక సంవత్సరంలో 6 శాతం ఆర్ధిక వృద్ధిరేటును ఆయన అంచనావేశారు. ఈ ఏడాదినుంచి కొత్త పెన్షన్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రవేశపెట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు.

  • ఉరకలెత్తిన స్టాక్‌మార్కెట్‌
  • పోస్టల్‌రేట్లు భారీగా పెంపు
  • ఐటి ప్రాడక్ట్స్‌ మరింత చౌక
  • సిన్హా బడ్జెట్‌కు వాజ్‌పేయి కితాబు
  • బడ్జెట్‌200-2002 విశేషాలు
  • తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more