వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులు ప్రమాదస్థితికిచేరలేదు: యనమల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంప్రమాదకరమైన అప్పుల ఊబిలో లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రియనమల రామకృష్ణుడు అన్నారు. 2001-2002బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన బుధవారం సమాధానమిచ్చారు. రుణాలనుఇకపై అనుత్పాదక రంగాలపై ఖర్చు పెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. నిజానికి అప్పులను కాంగ్రెస్‌ తమకువారసత్వంగా ఇచ్చిందని ఆయన విమర్శించారు.

విజన్‌ 2020 లక్ష్యాల సాధనకుఅనుగుణంగా తాను బడ్జెట్‌ను ప్రతిపాదించాననిఆయన అన్నారు. విజన్‌ 2020 లక్ష్యాల సాధనకు 30 లక్షల కోట్లరూపాయలు అవసరమవుతాయని, ప్రభుత్వపెట్టుబడులతో పాటు ప్రభుత్వం ప్రోత్సహించేప్రయవేట్‌ పెట్టుబడుల ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలుసిద్ధం చేసుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వక్యాపిటల్‌, రెవెన్యూ ఖర్చు 1998 నుంచి 2002 వరకు 14.5 శాతంపెరిగిందని, ఇలా యేటేటా ప్రభుత్వ ఖర్చునుపెంచుకుంటూ 2020 నాటికి 18,62,150 కోట్లు ఖర్చుచేస్తుందని ఆయన చెప్పారు.

మిగతా మొత్తాన్ని ప్రయివేట్‌పెట్టుబడుల ద్వారా సమీకరిస్తామని ఆయన అన్నారు.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, టూరిజం వంటిరంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా 16 కోట్లరూపాయల విదేశీ పెట్టుబడులు రాగలవని ఆయనఅన్నారు. అందువల్ల విజన్‌ 2020 లక్ష్యాల సాధనకు 30 లక్షల కోట్లరూపాయలు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నకుతావే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పేదరిక నిర్మూలనకు, స్త్రీ శిశుసంక్షేమానికి, ప్రాథమికావసరాలు తీర్చడానికి విజన్‌-2020లో లక్ష్యాలనునిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జిసొసైటీగా తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధిసాధించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వంట్రిపుల్‌ఐటి, బిజినెస్‌ స్కూల్‌ వంటి సంస్థల స్థాపనకుముందుక వచ్చిందని, ఇంజనీరింగ్‌, వైద్య కళాశాలలపెంపునకు చర్యలు తీసుకుందని ఆయనచెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిన మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 14 వ్యూహపత్రాలనువిడుదల చేసిందని, వాటిపై చర్చలు నిర్వహించిందనిఆయన చెప్పారు. ఆ వ్యూహపత్రాలను అసెంబ్లీలో కూడాపెట్టామని, కానీ ఒక్కరు కూడా వాటిని ప్రస్తావించకపోవడంవిచారకరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X