వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్కోపై ఎన్డీఏ సర్కార్‌ బచ్‌గయా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రభుత్వ రంగ సంస్థఅయిన భారత్‌ అల్యూమినియం లిమిటెడ్‌ సంస్థవ్యవహారంలో వాజ్‌ పేయి ప్రభుత్వం చావుతప్పికన్ను లొట్టపోయిన చందంగా బయటపడింది. ఈవ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానం విగిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వంహమ్మయ్య అనుకుంది. బాల్కోపై కాంగ్రెస్‌ప్రవేశపెట్టిన తీర్మానం 119-312 ఓట్లతో వీగిపోయింది.

బాల్కోపై తీర్మానం వీగిపోయినప్పటికీఅటు ప్రతిపక్షాల నుంచి ఇటు మిత్రపక్షాల నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం గట్టి వ్యతిరేకతనేఎదుర్కొన్నది. కీలకమైన బాల్కో వ్యవహారంపైశ్వేతపత్రం ప్రకటించాలని, ఉమ్మడి పార్లమెంటరీ కమిటీనినియమించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌చేసింది. రక్షణ రంగానికి ఉత్పత్తులు అందజేసే బాల్కోప్రైవేటీ కరణ దేశ భద్రతకే ముప్పుగా పరిణమించవచ్చుననివామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. లాభాలలోవున్నా బాల్కోను ఎందుకు తెగనమ్ముకోవాల్సివచ్చిందని వివిధ పార్టీలు సర్కార్‌ చర్యను తప్పుపట్టాయి.

బాల్కోపై ప్రభుత్వ వైఖరిసమర్థనీయంగా లేకపోయినప్పటికీ తాము ఎన్డీఏప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తామని శివసేనప్రకటించింది. ఈ కారణంగ ప్రభుత్వం కుప్పకూలిపోరాదనే ఉద్దేశ్యంతోనే కేంద్రాన్ని ఆదుకుంటున్నామని ఆ పార్టీ ఎం.పీ.లుచెప్పారు.

బాల్కోను ప్రైవేటీకరణచేయడాన్ని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పూర్తిగాసమర్థించుకున్నారు. లాభాల బాటలో వున్న సంస్థలను కూడా మరింత సమర్థంగాపనిచేయించేందుకు ప్రైవేటీకరిసున్నామనిజైట్లీ చెప్పారు. బాల్కో వ్యవహారం అంతాపారదర్శకంగా జరిగిందని, ప్రధాని కార్యాలయంప్రమేయ ఏ మాత్రం లేదని ఆయన స్పష్టంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X