వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడికినఅసెంబ్లీ-వాయిదా Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఓక్‌వెల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు అనుమతివ్వడంతో లోకసభస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమేయం వున్నదని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌వై.యస్‌. రాజశేఖరరెడ్డి చేసిన ఆరోపణ శుక్రవారం శాసనసభలో తీవ్రగందరగోళానికి దారి తీసింది. అధికార, ప్రతిపక్ష సభ్యులఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆవేశకావేషాలతో అసెంబ్లీఅట్టుడికిపోయింది. ప్రతిపక్ష సభ్యులు ఎంతటికీ శాంతించకపోవడంతో సభనుస్పీకర్‌ ప్రతిభా భారతి శనివారం నాటికి వాయిదావేశారు.

ఓక్‌వెల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు అనుమతిలో ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు, లోక్‌ సభ స్పీకర్‌ జిఎంసిబాలయోగి హస్తం వున్నదని ఆయనఆరోపించారు. విద్యుత్‌ ప్రాజెక్టులపై 304 నిబంధనకింద చర్చలో పాల్గొంటూ రాజశేఖరరెడ్డి ఈ ఆరోపణలుచేశారు. రాజశేఖరరెడ్డి ఆరోపణలకుతెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరంతెలియజేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నంచేశారు. పాలక తెలుగుదేశం, కాంగ్రెస్‌ శాసనసభ్యుల మధ్య ఆవేశకావేషాలుచోటు చేసుకున్నాయి. లోకసభ స్పీకర్‌పై అభాండాలువేయడాన్ని రెవెన్యూ మంత్రి పి. అశోక్‌గజపతి రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి అభాండాలువేయడం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితినికల్పిస్తుందని ఆయన అన్నారు. లోకసభ స్పీకర్‌పై ఆరోపణలుచేయడం సంప్రదాయం, పద్ధతి కాదని స్పీకర్‌కె. ప్రతిభా భారతి అన్నారు.

నాఫ్తా ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులనుంచి కరెంట్‌ను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రవిద్యుచ్ఛక్తి బోర్డు నష్టపోయిందని, 1994లోతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి విద్యుచ్ఛక్తి బోర్డు ఇబ్బందులనుఎదుర్కుంటోందని రాజశేఖరరెడ్డి అన్నారు. స్వల్ప వ్యవధివిద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల విషయంలో రాజశేఖరరెడ్డి చేసినవ్యాఖ్యలతో సభలో రభస జరిగింది. ఈ ప్రాజెక్టులకు అనుమతిఇవ్వడంలో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదనిఆయన విమర్శించారు. గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టుల ద్వారా తక్కువ ఖర్చుకువిద్యుదుత్పత్తి జరుగుతుందని, నాఫ్తా ఆధారిత ప్రాజెక్టుల ఉత్పత్తివ్యయం ఎక్కువని ఆయన చెప్పుతూ అటువంటప్పుడుగ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులను నెలకొల్పకుండా నాఫ్తా ఆధారిత ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వంఎందుకు సిద్ధపడిందని ప్రశ్నించారు. ఏడాదికి 200 కోట్లరూపాయలు అదనంగా చెల్లిస్తున్నారని కంఎ్టో్రలర్‌ అండ్‌ఆడిటర్‌ జనరల్‌ నివేదిక

తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలనితాము అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకుపట్టించుకోవడం లేదని ఆయనప్రశ్నించారు.

లోక్‌ సభ స్పీకర్‌ పై ఆరోపణలు చేసినవై.ఎస్‌. సభకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్‌చేసింది. దీనితో ప్రతిపక్షాల రెచ్చిపోయి వెల్‌ లోకిదూసుకువచ్చి సభా కార్యక్రమాలు స్తంభింపచేశారు. దీనితో సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు ఇదేఅంశంపై రభస సృష్టించడంతో సభను శనివారంనాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X