వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాజెక్టు మాకొద్దు:మనస్తాపంతో బాలయోగి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోనసీమ విద్యుత్‌ ప్రాజెక్టుకుగ్యాస్‌ కేటాయింపు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తనపై ఆరోపణలు వెలువెత్తడంతో లోక్‌సభస్సీకర్‌ జి.ఎం.సి. బాలయోగి మనస్తాపంచెందారు. దీంతో ప్రతిపాదిత గ్యాస్‌ ఆధార విద్యుత్‌ ప్లాంటునుఅసలు అమలాపురం నియోజకవర్గంలో ఏర్పాటుచేసేందుకు అనుమతి ఇవ్వవద్దని ఆయన ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్నందుననే ఆ ప్రాజెక్టుపై అనవసరవివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పుతున్నారు. కోనసీమ ప్రాంతంలోసహజవాయువు సమృద్ధిగాలభిస్తున్నందననే రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనకుముందుకు వస్తున్నారని ఆయన అన్నట్లు తెలిసింది.అసలు గ్యాస్‌ కేటాయింపు జరిపేది కేంద్రప్రభుత్వమని ఆయన గుర్తు చేసినట్లు వినికిడి.

విద్యుత్‌ ప్లాంటును వేరేచోట నెలకొల్పితే కోనసీమ ప్రజలఆకాంక్షలకు, అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని,అయినప్పటికీ దాన్ని అక్కడ నెలకొల్పవద్దని సూచించాననిఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రాజ్యాంగపరంగా ఉన్నతపదవిలో వున్న తాను అనవసర వివాదంపై బహిరంగవ్యాఖ్యలు చేయలేని స్థితిలో వున్నానని ఆయనమథనపడినట్లు తెలుస్తోంది.

బాలయోగి కోరినప్పటికీ ఈప్రాజెక్టుపై వెనుకడుగు వేయరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోనసీమ ప్రాంతంలోదాన్ని ఏర్పాటు చేయరాదని ఇప్పుడు నిర్ణయిస్తే మరిన్నివిమర్శలకు, కొత్త డిమాండ్లకు తావు కల్పించినట్లవుతుందని ప్రభుత్వంఅనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, తనపైవచ్చిన ఆరోపణల మీద బహిరంగంగా స్పందించేందుకుఆయన నిరాకరిస్తున్నారు.

హైదరాబాద్‌: తాము రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఎటువంటి అనుచిత ప్రయోజనాలుపొందలేదని కోనసీమ ఇపిఎస్‌ ఒక్‌వెల్‌ పవర్‌ లిమిటెడ్‌ శుక్రవారం ఒకప్రకటనలో స్పష్టం చేసింది. కోనసీమ ప్రాంతంలో పుష్కలంగా లభించేగ్యాస్‌ను ఇంధనంగా వాడుకుంటూ యూనిట్‌కు 94 పైసల అతి తక్కువపిక్స్‌డ్‌ కాస్ట్‌తో రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ను అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇంధనంగా గ్యాస్‌ వినియోగంవల్ల తగ్గుతున్న ఉత్పత్తి వ్యయాన్ని పూర్తిగావినియోగదారులకే వర్తింపజేయనున్నట్లుప్రకటించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రాజెక్టు ప్రగతినిఅడ్డుకోవాలని చూస్తోందని విమర్శించింది. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిచొరవ తీసుకుని చర్చల ద్వారా పిక్స్‌డ్‌ కాస్ట్‌ను రూ1.40నుంచి 94 పైసలకు తగ్గించడానికి కృషి చేశారనిచెప్పింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2.70 కోట్ల అతి తక్కువవ్యయానికి ఒక మెగావాట్‌ను విద్యుత్‌ను ఉత్పత్తిచేయనున్నట్లు సంస్థ తెలిపింది.

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ
  • విద్యుత్‌ గోల్‌ మాల్‌ పై విచారణఃవై.ఎస్‌.
  • అట్టుడికిన అసెంబ్లీ-వాయిదా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X