• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నారైల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

By Staff
|

హైదరాబాద్‌ః భారత దేశంలో కష్టాలలో వున్న వారిని ఆదుకొనేందుకు ముందుకు వచ్చే ప్రవాస భారతీయు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్‌ రావు శనివారం హైదరాబాద్‌ లో ఈ విషయాన్ని ప్రకటించారు. గుజరాత్‌ భూకంప బాధిత గ్రామాలను దత్తత తీసుకొనేందుకు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. అయితే వారిఅందిస్తున్న సాయం సద్వినియోగం అవుతున్నదా లేదా అనే అనుమానాల కారణంగా మరింత సాయంఅందడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రవాస భారతీయులకు వారందించిన నిధుల వినియోగం గురించి పూర్తి సాయంఅందించేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు.

భారత దేశంలో గ్రామాల వారీగా కష్టాలలో వున్న వారివివరాలను, వారికి ఎవరు సాయం చేయాలనుకుంటున్నారు? ఎన్ని నిధులు వచ్చాయి? అవి ఎలా సద్వినియోగం అనేవివరాలన్నీ ఆ వెబ్‌ సైట్‌ లో వుంటాయని ఆయన చెప్పారు. హృద్రోగంతో బాధపడుతూ శస్త్ర చికిత్స కోసం నిధులు లేని నిరుపేదలవివరాలను కూడా ఆ వెబ్‌ సైట్‌ లో వుంచుతామని ఆయన చెప్పారు.వీరికి సహాయం అందించే ప్రవాస భారతీయులకు పూర్తి స్థాయిలో రాయితీలుఅందించాలని యోచిస్తున్నట్లు విద్యాసాగర్‌ రావు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X