వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర పథకాన్నిఆపలేదు: పోచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజనపథకాన్ని నిలిపేయలేదని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం శాసనసభలో స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో అనేక అవకతవకలు,అక్రమాలు జరుగుతున్నాయని, ఈ పథకం నిధులనువేరే పథకాలకు మళ్లించారని కాంగ్రెస్‌ సభ్యులు డాక్టర్‌ఎం.వి. మైసురారెడ్డి, డి. నాగేందర్‌, కొండా సురేఖవిమర్శించారు. ఈ పథకం నిధులను ఇతర పథకాలకుమళ్లించలేదని మంత్రి చెప్పారు. అక్రమాలకు, అవినీతికిఅవకాశమే లేదని ఆయన అన్నారు.

పోస్టుల భర్తీకి కేసు అడ్డం

పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగావున్న 397 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకిసుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్న కేసు ఆటంకంగావున్నదని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో వున్నందున ఆ పోస్టులను భర్తీచేయలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీజరగనందున గ్రామాల్లో నీటి వసతి,పారిశుధ్యం పనులు జరగడం లేదని కాంగ్రెస్‌ సభ్యులన్నారు. ఖాళీగావున్న ఈ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వంహామీ ఇస్తే కేసును ఉపసంహరించుకుంటారని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖరరెడ్డి చేసినవిజ్ఞప్తికి మంత్రి సరిగా స్పందించలేదు.

ఆస్పత్రుల్లోవినియోగ ఛార్జీలు

జిల్లాల్లోని ఆస్పత్రుల్లో రోగులనుంచి వినియోగ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లువైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయల అరుణ అంగీకరించారు.కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసురా రెడ్డిఅడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెల్లకార్డులున్నవారినుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆమెచెప్పారు. ప్రత్యేక సేవలందించేందుకు ప్రయివేట్‌ ఆస్పత్రులను అనుమతించినట్లు కూడా ఆమె తెలిపారు.

తెల్లకార్డులున్నవారి నుంచి కూడా ఛార్జీలువసూలు చేస్తున్నారని ఎం. రాజయ్య (సిపిఎం) సభదృష్టికి తెచ్చారు. రోగుల నుంచి పెద్ద మొత్తంలోవైద్యులు డబ్బుల వసూలు చేస్తున్నారని సునీతారెడ్డి(కాంగ్రెస్‌) అన్నారు.

పేదల నుంచి ఏఆస్పత్రిలోనైనా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయల అరుణహామీ ఇచ్చారు. వినియోగ ఛార్జీలను కూడా చాలా తక్కువగానిర్ణయించామని ఆమె చెప్పారు. వసులైనవినియోగ ఛార్జీలను ఆస్పత్రుల్లో వైద్యపరికరాలు, ఇతర సదుపాయాలు సమకూర్చేందుకువినియోగిస్తామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X