• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబ్రీ కమిషన్‌ ఎదుట అద్వానీగైరాజరు

By Staff
|

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ లిబర్‌హన్‌ కమిషన్‌ ముందు కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్‌కె అద్వానీ సోమవారం నాడు హాజరుకాలేదు. అద్వానీ గైరాజరును న్యాయమూర్తి లిబర్‌హన్‌ తీవ్రంగా పరిగణించారు. కనీసం వచ్చే వాయిదాకైనా అద్వానీ కోర్టు ఎదుట హాజరయ్యేట్టుగా చూస్తారా అని అద్వానీ తరఫు న్యాయవాది సత్యపాల్‌జైన్‌ను లిబర్‌హన్‌ ప్రశ్నించారు.

ఒక సారి ఈశాన్య రాష్ట్రాల పర్యటన కారణంగా ఆయన కమిషన్‌ ఎదుట హాజరుకాలేకపోయారని ఈ సారి పోర్ట్‌బ్లేయర్‌లో అత్యవసర సమావేశం వున్నందున రాలేకపోయారని అద్వానీ తరఫు న్యాయవాది సమర్పించిన వివరణలను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఏప్రిల్‌ 10, 11 తేదీలకు విచారణను వాయిదా వేస్తూ, ఈ సారి విచారణనువాయిదా వేసే ప్రసక్తే లేదని హోం మంత్రి విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X