వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం ఎంపి గుత్తా రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తాసుఖేందర్‌ రెడ్డి తన లోక్‌సభసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకుఅందజేశారు. ఈ విషయాన్ని ఆయన జిల్లాతెలుగుదేశం పార్టీ సర్వసభ్యసమావేశంలో ఆయన ప్రకటించారు. శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బిసి) ద్వారా దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిప్రథమ వర్ధంతి (మార్చి 7) నాటికి సాగు నీళ్లుఅందిస్తామని, లేనట్లయితే పదవీ త్యాగం చేస్తానని గతంలోఆయన ప్రకటించారు. గడువులోగా నీరందించలేకపోవడంతో నైతికి బాధ్యతవహించి తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈసమావేశంలో మాధవరెడ్డి సతీమణి, రాష్ట్ర మంత్రి ఉమామాధవరెడ్డి కూడాపాల్గొన్నారు.

తాను ప్రతిపక్షాల ఒత్తిడితో రాజీనామాచేయలేదని, తన రాజీనామాతోనైనా ఎస్‌ఎల్‌బిసి పూర్తవుతుందనేనమ్మకంతోనే రాజీనామా చేశానని ఆయన అన్నారు.సుఖేందర్‌ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరంలేదని, ఎవరూ కేటాయించనన్ని నిధులు ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కేటాయించారని, సాంకేతిక కారణాలవల్ల ఎస్‌ఎల్‌బిసి పనుల్లో స్తబ్దత ఏర్పడిందనితెలుగుదేశం అసోసియేట్‌ సభ్యుడు మోత్కుపల్లినర్సింహులు అన్నారు.

తన హామీని నిలబెట్టుకోవడంలోవిఫలమైన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడుతున్నారని నల్లగొండకాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డివిమర్శించారు. సుఖేందర్‌ రెడ్డి తన రాజీనామాను ముఖ్యమంత్రికి కాకుండా లోక్‌సభస్పీకర్‌కు పంపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనిఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X