వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి భారత్‌ ఆధ్యాత్మికసంపద Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రపంచానికి భారత్‌సుసంపన్నమైన ఆధ్యాత్మిక సంపదను అందిస్తున్నదని ప్రధానివాజ్‌ పేయి అన్నారు. కురుక్షేత్రలోని బ్రహ్మసరోవర్‌సమీపంలో తలపెట్టిన పరిక్రమకు వాజ్‌ పేయిమంగళవారం శంకుస్థాపన చేశారు. దేశంలోనిఅపురూప దేవతా చిత్రాలకు ఈ పరిక్రమ వేదికగానిలుస్తుందని ఆయన అన్నారు. ప్రపంచదేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్నిమానవాళికి అందిస్తుంటే భారత్‌ శాశ్వతమైన ఆధ్యాత్మికసంపదను అందిస్తున్నది. మానవాళి వికాసం కోసం ఈ రెంటినీమేళవించి పరిశోధనలు జరపాల్సిన అవసరంవుందని వాజ్‌ పేయి అభిప్రాయ పడ్డారు.

భారత్‌ ఎప్పుడూ ప్రపంచ శాంతినేకోరుకున్నదని ఆయన చెప్పారు. పరాయి వారి భూమినిఆక్రమించాలనే ఆశ భారత్‌ కు ఎన్నడూ లేదనిఆయన పాక్‌ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. కాశ్మీర్‌ సమస్యకు కూడా శాంతియుత పరిష్కారంసాధించేందుకే భారత్‌ కృషి చేస్తున్నదనివాజ్‌ పేయి చెప్పారు. అణ్వాయుధాన్ని తయారు చేసినప్పటికీ అది ఆత్మరక్షణకే తప్పమరొకరిపై దాడికోసం కాదని ఆయన స్పష్టంచేశారు.

శాంతి, సామరస్యం అంటూ ప్రాదేశిక సమగ్రతనువిస్మరించే ప్రసక్తి లేదని వాజ్‌ పేయి స్పష్టం చేశారు. శాంతియుతంగా వుంటూ అభివృద్ధి సాధించడమే భారత్‌ లక్ష్యమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X