• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యార్థిని ప్రసవం-హెచ్‌.ఎం.సస్పెన్షన్‌

By Staff
|

విశాఖపట్నంః అరకులోయలోని గురకులపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ళ బాలిక ప్రసవించినసంఘటనపై హెడ్‌ మాస్టర్‌ ను, వార్డెన్‌ ను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. బాలిక గర్భం ధరించడానికికారకుడుగా భావిస్తున్న ఐటిఐ విద్యార్థి రామకృష్ణనుఅరెస్టు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జె.వి.ఎస్‌.ప్రసాద్‌ బుధవారం ప్రకటించారు. అరకులోయలోని గిరిజన సంక్షేమ గురుకులపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భంధరించి ఆడపిల్లను ప్రసవించిన విషయం విదితమే. ఈవిషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకివచ్చింది.

ఆ బాలిక ఆడపిల్లనుప్రసవించగా, పుట్టిన బిడ్డ కొద్ది సేపటికేమరణించింది. ఈ వ్యవహారం విశాఖపట్నంజిల్లాలో సంచలనం సృష్టించింది. గురుకులహాస్టళ్ళు అనాధ ప్రేతాలుగా మారాయనడానికి ఈ సంఘటననిదర్శనం అంటూ పలు స్వచ్ఛంద సంస్థలుధ్వజం ఎత్తాయి. దీనితో ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరుచుకుంది.

తమ పాఠశాలలో చదివే బాలిక గర్భం ధరిస్తే ఆ పాఠశాల హెడ్‌మాస్టర్‌ తనకు తెలియదంటూబుకాయిస్తున్నారని, పాఠశాల హెడ్‌ మాస్టర్‌ శర్మ,వార్డెన లక్ష్మిని సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ప్రకటించారు. ఈ వ్యవహారంపై 10 రోజుల్లోగా పూర్తిస్థాయినివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లుఆయన చెప్పారు. బాలిక గర్భం ధరించడానికిబాధ్యుడుగా భావిస్తున్న రామకృష్ణ అనే ఐటిఐవిద్యార్థిని అరెస్టు చేసినట్లు కూడా కలెక్టర్‌చెప్పారు.

  • ఆశ్రమ పాఠశాల విద్యార్ధినికి గర్భం
  • తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more