• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టాక్‌ మార్కెట్ల పతనంపై ఆందోళన

By Staff
|

న్యూఢిల్లీః భారత స్టాక్‌ మార్కెట్లు 1992 తరహాలో గందరగోళంగా మారుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేసింది. హర్షద్‌ మెహతా అనుచరులు కొందరి గుప్పెట్లో భారత్‌ స్టాక్‌ మార్కెట్లు విలవిలలాడి పోతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆయన హెచ్చరించారు.

కొందరు వ్యక్తులు సిండికేట్‌ గా ఏర్పడి, బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని స్టాక్‌ మార్కెట్‌ ను నియంత్రిస్తున్నాయని జైపాల్‌ రెడ్డి ఆరోపించారు. హర్షద్‌ అనుచరుడుకేతన్‌ పరేఖ్‌ కు స్టాక్‌ మార్కెట్ల పతనంతం సంబంధం వున్నదని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఖండించారు. భారత స్టాక్‌ మార్కెట్లు సలక్షణంగా వున్నాయని ఆయన చెప్పారు.

మరోవైపు గత రెండు రోజులుగా భారీగా పతనం అవుతూ వచ్చిన బి.ఎస్‌.ఇ. బుధవారంస్వల్పంగా 45 పాయింట్ల మేరకు కోలుకున్నది. మధ్యాహ్నం వరకు భారీ హెచ్చుతగ్గులకు లోనైనసెన్సెక్స్‌ ఆ తరువాత సెబి విధించిన అదనపు మార్జిన్ల పుణ్యమా అని కోలుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X