వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా బిల్లుకు మోక్షంఃవాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటుసమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లునుప్రవేశపెట్టనున్నట్లు ప్రధాన మంత్రి అటల్‌బిహారి వాజ్‌ పేయి ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయసాధనకు త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు గురువారం ఆయనప్రకటించారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విలేకరులు, ప్రముఖమహిళలతో వాజ్‌ పేయి తన నివాసంలో ముచ్చటించారు.మహిళలకు చట్టసభల్లో 33 శాతంరిజర్వేషన్‌ కల్పించే విషయంపై పలువురువాజ్‌ పేయిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ వ్యవహారంలోఏకాభిప్రాయాన్ని సాధించగలమనే విశ్వాసం వున్నదనివాజ్‌ పేయి బదులిచ్చారు. ఈ సమావేశాల్లోనేరిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెడతామని ఆయనహామీ ఇచ్చారు.

అయితే ఈ హామీని కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎద్దేవా చేశారు. ఈమాటలు చాలాకాలంగా వింటున్నామని ఆమె విమర్శించారు. ఈ బిల్లు తేలికగా సభఆమోదం పొందుతుందని, వాజ్‌ పేయి ప్రభుత్వంఅనవసరంగా తాత్సారం చేస్తున్నదని ఆమె విమర్శించారు.

బిల్లును యథాతథంగాఆమోదించనిచ్చే ప్రసక్తి లేదని సమాజ్‌ వాది పార్టీ నేతములాయం సింగ్‌ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రంమహిళా రిజర్వేషన్‌ బిల్లును సాధ్యమైనంతత్వరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతున్నది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లునుయథాతథంగా ఆమోదించే ప్రసక్తి లేదనిబి.ఎస్‌.పి., సమాజ్‌ వాది, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలు మొండికెత్తుతున్నాయి.మహిళా రిజర్వేషన్లను కులాల వారీగాకల్పించాలని, ఆ మేరకు చట్టంలో అవసరమైనమార్పులు చేయాలని ఆ పార్టీలు పట్టుపడుతున్నాయి.ఒకవైపు బిఎస్‌.పి, ఎస్‌.పి. పార్టీలను రెచ్చగొడుతూమరోపైపు మహిళల పట్ల కాంగ్రెస్‌ మొసలి కన్నీరుకారుస్తున్నదనే విమర్శలు వున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రెండునాల్కల ధోరణి అవలంబిస్తున్నదని బిజెపిబాహాటంగానే విమర్శిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X