వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజరుద్దీన్‌ బన్‌గయా బిజినెస్‌ మాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో జీవిత కాలం నిషేధానికి గురైన భారత క్రికెట్‌ జట్టుమాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ కొత్తఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆయన భార్య సంగీత బిజలానీ తీ కలిసిఅజర్‌ వినూత్న ఇన్నింగ్స్‌ కు శనివారం శ్రీకారం చుట్టారు. ఛారిటీ తో పాటువ్యాపార లావాదేవీలు నిర్వహించే లక్ష్యంతో అజర్‌ సంగీతామేనేజ్‌ మెంట్‌ సర్వీస్‌ ప్రారంభించనున్నట్లుఅజరుద్దీన్‌, సంగీతా బిజలానీ శనివారంహైదరాబాద్‌ లో జరిగిన విలేకరులసమవాశంలో ప్రకటించారు. అజర్‌ సంగీతా మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ కు అనుబంధంగా అజర్‌ సంగీతా ఎయిడ్స్‌ఫౌండేషన్‌ కూడా ప్రారంభించనున్నట్లు అజర్‌వివరించారు. దేశంలోని ఎయిడ్స్‌ బాధితులనుఆదుకోవడంతో పాటు వారిలో చైతన్యంకలిగించి, మార్గదర్శకంగా వుండడమే ఈఫౌండేషన్‌ లక్ష్యమని అజర్‌ చెప్పారు.

ఈఫౌండేషన్‌ కార్యక్రమాల పరంపరకు నాందిగా గుజరాత్‌ బాధితులసహాయార్థం ఈ ఇరువురు రేపు (ఆదివారం) ఒక సాంస్కృతికప్రదర్శన నిర్వహించనున్నారు. తమ సంస్థ తరఫునమ్యాజిక్‌ జాన్సన్‌ రోల్డ్‌ కూడా బహూకరించనున్నట్లు అతను తెలిపాడు. రేపటి సాంస్కృతికప్రదర్శనలో దేశంలో పేరు మోసిన మధు సప్రేవంటి పలువురు మోడల్స్‌, తలత్‌ అజీజ్‌ వంటిగజల్స్‌ కళాకారులు పాల్గొంటారు.

వచ్చే నెలలోబెంగుళూరులో ఇటువంటి కార్యక్రమమే నిర్వహించనున్నట్లుఅజర్‌, బిజలానీ వెల్లడించారు. సినీ రంగ ప్రముఖలకు తమ సంస్థనుంచి క్రిస్టల్‌ అవార్డులు ఇవ్వనున్నట్లు వారువెల్లడించారు. సినీ, టెలివిజన్‌ రంగాలకు సాఫ్ట్‌వేర్‌ అందించాలని కూడా తమ సంస్థ యోచిస్తున్నదనిఅజరుద్దీన్‌ చెప్పారు.

ఈ సంస్థను రెండేళ్ళకిందటే ప్రారంభించాలని సంకల్పించామని అయితే క్రికెట్‌లో బిజీగా వున్న కారణంగా సాధ్యం కాలేదనిఆయన వివరించారు.

క్రికెట్‌ పై ఎటువంటి ప్రశ్నలువేయవద్దని అజర్‌ విలేకరులను కోరారు. వివాదాలకుదూరంగా వుండాలన్నదే తన అభిమతమని, తనన్యాయవాదుల సలహా మేరకు క్రికెట్‌ గురించిమాట్లాడనని ఆయన చెప్పారు. క్రికెట్‌ నుంచి నిషేధానికిగురైన అజరుద్దీన్‌ ఇలా కొత్త అవతారం ఎత్తడందేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X