• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరవు జిల్లాలలోనూ గోల్‌ మాల్‌

By Staff
|

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడి పోతున్నా కేవలం 142 మండలాలలో మాత్రమే కరవు వున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా వున్నదని కాంగ్రెస్‌, వామపక్షాలు దుయ్యబట్టాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాఅయిన చిత్తూరు పట్ల అతి ప్రేమ కనబరిచారని కాంగ్రెస్‌ పార్టీవిమర్శించింది. చిత్తూరులోని 65 మండలాలలో 45 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో 650 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ కోరింది.

కరవు మండలాల జాబితాను తిరిగి సమీక్షించాలని సిపిఐ కోరింది. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, కర్నూలు, మహబూబ్‌ నగర్‌, అనంతపురం జిల్లాలలోని దాదాపు అన్ని మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని సిపిఐ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. ఈ జిల్లాలలో కేవలం 10 నుంచి 15 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించడం విడ్డూరంగా వున్నదని ఆయన చెప్పారు. కరవు మండలాల జాబితాను ప్రభుత్వం పునః సమీక్షించాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X