వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖురాన్‌ పుకార్లపై విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు దుండగులు ముస్లీంల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ప్రతులను దగ్ధం చేశారంటూ గతవారం వ్యాపించిన పుకార్లపై ప్రధాని వాజ్‌పేయి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మంగళవారంనాడు లోకసభ జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన ఈ మేరకు ఒక ప్రకటనచేశారు.

ఢిల్లీలో ఖురాన్‌ ప్రతులను దగ్ధం చేశారంటూ వ్యాపించిన పుకార్లవల్ల ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం విదతమే. మొదట ముస్లీంలీగ్‌ సభ్యుడు ఈ విషయం సభలో లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి పుకార్ల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని సభకు హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X