• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెమేరాకళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌

By Staff
|

న్యూఢిల్లీః భారతదేశరాజకీయ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయాలకు... అవినీతికి అవినాభావ సంబంధంవున్నదనే విషయం జగద్విదితం. అయితే అవినీతి బాగోతాన్ని ఇలావీడియోలలో చిత్రీకరించి మరీ బట్టబయలుచేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. అదీ ఒకవెబ్‌ సైట్‌ ఈ సంచలనానికి నాంది పలికింది.ఐ.టి. ప్రభంజనం తెచ్చిన పెనువిప్లవంభారతదేశంలో నరనరానా జీర్ణించుకు పోతున్నఅవినీతిఅంతానికి తోడ్పడడం నిజంగా హర్షణీయం.

క్రికెట్‌ లో కోట్లాది రూపాయలమ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాన్ని వీడియోటేపులతో సహా నిరూపించిన డాట్‌ కాం కంపెనీ ఈ సారిరాజకీయ రంగంలో వున్న అవినీతిపై తన కెమేరానుగురిపెట్టింది. గత ఆగస్టు నుంచి ఒక పథకం ప్రకారం రక్షణ శాఖఉద్యోగులు, దళారులు, రాజకీయ పార్టీల నేతలు,ప్రముఖలు.....ఇలా ఎందరినో కలుసుకుంది. రక్షణ శాఖకుచెందిన కాంట్రాక్టులు ఇప్పించాల్సిందిగా వారు ఆ నేతలనుకోరారు. అందుకో బంగారు లక్ష్మణ్‌ కు లక్ష రూపాయలు, రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెంజ్‌ నివాసంలో సమతా పార్టీ అధ్యక్షురాలుజయా జైట్లీకి రెండు లక్షల రూపాయలను ఆ డాట్‌ కాం కంపెనీఅందజేసింది.

ఈ వ్యవహారం మొత్తాన్నివీడియోలో చిత్రీకరించింది. ఈ ముడుపులబాగోతంపై సుమారు వంద గంటల నిడివిగలటేప్‌ లను, ఒక నివేదికను మంగళవారంకొత్తఢిల్లీలో ఒక విలేకరుల సమావేశంలోవెల్లడించింది. బంగాలు లక్ష్మణ్‌ లక్షరూపాయల డబ్బు తీసుకుంటున్న ఘట్టం, జైట్లీ ఆడియో వీడియోటేప్‌ లను ఆ డాట్‌ కాం ఎడిటర్‌ ప్రజల ముందుంచారు. ఈవ్యవహారంలో పలువురు మిలటరీ అధికారులు,మిలటరీ సిబ్బంది ముసుగులో వున్న దళారీల అవినీతిపర్వం వెలుగు చూసింది.

ఇటువంటి అవినీతిబాగోతాలలో ప్రింటి మీడియా కేవలం డాక్యుమెంటరీ ఆధారాలు, లేకపోతే ఆడియో ఆధారాలు మాత్రమేవెల్లడించాయి. అయితే ముడుపులుతీసుకుంటుండగా రహస్యంగా వీడియో తీసి, దానిని ప్రజలముందుంచడం డాట్‌ కాంలు సాధించిన సంచలనంగాచెప్పుకోవచ్చు. డబ్బు తీసుకుంటున్నప్పుడు ఆ నేతలు మాట్లాడినమాటలు, హావభావాలు, ఏ ఏ అధికారులు,రాజకీయ నాయకులకు దీనితో సంబంధం వున్నదనేవ్యవహారం అంతా చక్కగా సినిమాలాగా ప్రజల కళ్ళముందు వున్నది. ఆడియో లేదా డాక్యుమెంటరీ సాక్ష్యాలను సృష్టించినవిగాచెప్పుకొనే వీలుంది. అయితే ఈ వీడియో ఆధారాలను త్రోసి రాజనడం ఎవరి తరం?

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీరంగంలో సాధించిన ప్రగతి దేశంలోని అవనీతినిబట్టబయలు చేసేందుకు ఉపయోగపడడంనిజంగా ముదావహం. అవనీతి స్వాములుగా మారినరాజకీయ నేతలు ఇక మీదట కాస్త ముందూ వెనకాచూసుకొని ముడుపులు తీసుకోవలసి వుంటుంది.ఎందుకంటే కెమేరా కళ్ళుంటాయ్‌......... ఖబడ్దార్‌!!

  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!
  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • బంగారు లక్ష్మణ్‌ రాజీనామా
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు
  • తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more