వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః ఆంధ్రరాష్ట్రంలో ఏ మాత్రం పట్టులేని బంగారులక్ష్మణ్‌, దీర్ఘకాలంగా బిజెపిని అంటిపెట్టుకొని వుండడం, దళితుడు కావడంతో పార్టీ జాతీయఅధ్యక్ష పదవిని సంపాదించారు. బిజెపి జాతీయవ్యవహారాలలో ప్రధాని వాజ్‌ పేయి, అద్వానీదే కీలక పాత్రవహించడంతో లక్ష్మణ్‌ ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. అయితేదీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేఅలోచనతో లక్ష్మణ్‌ తెహల్కా పన్నినఉచ్చులో చిక్కుకు పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దమనిషిగా పేరున్న బంగారు లక్ష్మణ్‌ముడుపులు తీసుకుంటూ తెహల్కాకెమెరాలకు ఏవిధంగా దొరికిపోయారనే విషయాన్ని చూద్దాం. అరెస్సెస్‌ కీలక ట్రస్టీ, ఆయుధ ఒప్పందాల మధ్యవర్తి ఆర్‌. కె. గుప్తా ద్వారా వీరిద్దరూ బిజెపి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ను కలుసుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రరాష్ట్రంలో ఏ మాత్రం పట్టులేని బంగారులక్ష్మణ్‌, దీర్ఘకాలంగా బిజెపిని అంటిపెట్టుకొని వుండడం, దళితుడు కావడంతో పార్టీ జాతీయఅధ్యక్ష పదవిని సంపాదించారు. బిజెపి జాతీయవ్యవహారాలలో ప్రధాని వాజ్‌ పేయి, అద్వానీదే కీలక పాత్రవహించడంతో లక్ష్మణ్‌ ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. అయితేదీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేఅలోచనతో లక్ష్మణ్‌ తెహల్కా పన్నినఉచ్చులో చిక్కుకు పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెద్దమనిషిగా పేరున్న బంగారు లక్ష్మణ్‌ముడుపులు తీసుకుంటూ తెహల్కాకెమెరాలకు ఏవిధంగా దొరికిపోయారనే విషయాన్ని చూద్దాం.

  • అరెస్సెస్‌ కీలక ట్రస్టీ, ఆయుధ ఒప్పందాల మధ్యవర్తి ఆర్‌. కె. గుప్తా ద్వారా వీరిద్దరూ బిజెపి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ను కలుసుకున్నారు.

  • లక్ష్మణ్‌ పి.ఎ. సత్యమూర్తి తెహల్కా నుంచి 10 వేలు లంచం తీసుకున్నాడు. రాజు అనే మరో కార్యాలయ సిబ్బంది బంగారు గొలుసును బహుమతిగా కొట్టేశాడు.

  • ఆ తరువాత తెహల్కా రిపోర్టర్లకు లక్ష్మణ్‌ దర్శన భాగ్యం కలిగింది.

  • లక్ష్మణ్‌ బుద్ధిగా ఏదో రాసుకుంటుండగా...రక్షణ వస్తువులను సరఫరా చేసే కంపెనీ సిబ్బందిగా ఆయన గదిలోకి ప్రవేశించిన ఇద్దరు తెహల్కా రిపోర్టర్లు ఆయనకు విష్‌ చేసి కూర్చున్నారు.

  • ఈ వ్యవహారంలో మధ్య వర్తులు ఎందుకు?మీరు నేరుగా నా దగ్గరకు రావచ్చు అని లక్ష్మణ్‌ వారితో అన్నారు.

  • ఆరెస్సెస్‌ ట్రస్టీ గా వున్న ఆర్‌.కె. గుప్తా ఆయన అంతట ఆయనే మమ్మల్ని కలిశారని, ఈ వ్యవహారంలో మాకు సాయం చేసేందుకు 10 లక్షలు మీరు అడిగారని అతను చెప్పారని రిపోర్టర్లు బొంకారు. మీరేమో 20 లక్షలు అడుగుతున్నారని ప్రశ్నించారు.

  • లక్ష్మణ్‌ అందుకు మౌనం వహించారు.

  • ఈ డీల్‌ ఎంత మొత్తానికి.... మీ కంపెనీ ఓనర్‌ ఎవరు? అతని ఆర్థిక స్థితి గతులు ఎమిటనే వివరాలన్నీ లక్ష్మణ్‌ వారిని అడిగి తెలుసుకున్నారు.

  • కాంట్రాక్టు విలువ 200 కోట్లు అని డాట్‌ కాం విలేకరులు చెప్పడంతో లక్ష్మణ్‌ నోరు తెరిచారు. భారత రాజకీయాలలో ఇంతటి డీల్స్‌ సాధ్యం అంటారా అని ప్రశ్నించారు. అయినా ప్రయత్నిస్తాం అని లక్ష్మణ్‌ బేరం వదులుకోకుండా మాట్లాడడం ప్రారంభించారు.

  • ఇప్పటిదాకా నేను ప్రధాన మంత్రి కార్యదర్శి బ్రిజేష్‌ మిశ్రా సహాయం తీసుకుంటా వున్నాను. ఆయనకు బాగా పలుకుబడి వుంది. ప్రధాని కూడా ఆయన మాటను వేదంగా భావిస్తారని లక్ష్మణ్‌ చెప్పారు.

  • ప్రధాని అల్లుడు రంజన్‌ భట్టాచార్య ఏ ఏ వ్యవహారాలు నిర్వహిస్తారనే విషయాన్ని కూడా లక్ష్మణ్‌ వివరించారు. రక్షణ వ్యవహారాలలో ఆయనకు పెద్దగా జోక్యం లేకపోయినా విద్యుత్‌ ప్రాజెక్టులు తదితర విషయాలలో ఆయన కీలక పాత్ర వహిస్తారు.

  • ఈ వ్యవహారానికి అడ్వాన్సుగా కాకుండా నూతన సంవత్సర కానుకగా ఈ లక్ష రూపాయలు తీసుకొండి అని రిపోర్టర్లు లక్ష రూపాయలను లక్ష్మణ్‌ టేబుల్‌ మీద వుంచారు. వద్దు వద్దు అంటూనే లక్ష్మణ్‌ వాటిని తీసుకొని సొరుగులో పెట్టుకున్నారు.

  • ఈ క్రమం మొత్తాన్ని తెహల్కా వీడియో టేపుల్లో బంధించింది.

  • మంగళవారం కొత్త ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి వీటిని
    బహిర్గంతం చేసింది.

  • ఇదంతా కాంగ్రెస్‌ కుట్ర అని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. దళితుడు బిజెపి అధ్యక్ష పీఠంపై వుండండ ఇష్టంలేని వారు పన్నిన కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీకి విరాళంగా కొంత డబ్బు తీసుకున్న మాట వాస్తవం అని ఆయన అంగీకరించారు.

  • ఇంత రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయిన లక్ష్మణ్‌ ఇంకా నేను లక్ష్మణ రేఖ దాటలేదంటే మాత్రం ఎవరు నమ్ముతారు?!

    • బంగారు లక్ష్మణ్‌ రాజీనామా

    • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X