వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాల్‌ మే కుచ్‌కాలా: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహల్కాడాట్‌కామ్‌ బయట పెట్టిన రక్షణ వ్యవహారాలవిషయంలో కొంత గందరగోళం వున్నదని ప్రధానిఅటల్‌ వాజ్‌పేయి అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం రాజీనామాచేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలుబుధవారం స్తంభించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటివిచారణకైనా, దర్యాప్తునకైనా సిద్ధమేననిఆయన అన్నారు. అయితే, విచారణకు గానీ, దర్యాప్తునకు గానీఆదేశించే ముందు పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలనిఆయన అన్నారు. ముందు సభలో చర్చజరగనివ్వండని పార్లమెంటు హౌస్‌లో ఆయనవిలేకరులతో అన్నారు.

రక్షణ వ్యవహారంలోకొందరి పేర్లు వుండడాన్ని బట్టి ఇందులో ఏదోగందరగోళం వున్నట్లు తోస్తోందని ఆయనఅన్నారు. దాల్‌ మే కుచ్‌ కాలా హై అని ఆయనఅన్నారు. ఇందులో ఏదో కుట్ర కూడా వుండవచ్చుననిఆయన అన్నారు.

రాజ్యసభ సమావేశమైన ఏడునిమిషాల వ్యవధిలోనే వాయిదా పడగా లోక్‌సభ రెండు సార్లువాయిదా పడింది.

ప్రభుత్వ రాజీనామాకు డిమాండ్‌

రక్షణ కుంభకోణం నేపథ్యంలోవాజ్‌పేయి ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూకాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) తీర్మానంచేసింది. బోఫోర్స్‌ కుంభకోణానికి ఈ కుంభకోణానికి సంబంధంలేదని కాంగ్రెస్‌ నేత అంబికా సోనీ అన్నారు.బోఫోర్స్‌ కుంభకోణంలో నేరాలకు ఆధారలేలేవని, ఇక్కడ బంగారు లక్ష్మణ్‌ ముడుపులు తీసుకున్నట్లు ఆధారలువున్నాయని ఆమె అన్నారు.

వాజ్‌పేయి ప్రభుత్వ రాజీనామాను డిమాండ్‌ చేస్తూదేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనిమాజీ ప్రధానులు వి.పి. సింగ్‌, హెచ్‌.డి. దేవేగౌడ,సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌,వామపక్షాల నేతలు ప్రజాతంత్ర, దేశభక్త శక్తులకుపిలుపునిచ్చారు. అధికారంలో కొనసాగే నైతికహక్కు లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శిహరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ నివాసంలో జరిగినసమావేశంలో ఈ నేతలు అభిప్రాయపడ్డారు.

తాను పార్టీ పదవికి రాజీనామాచేయాల్సిన అవసరం లేదని సమతాపార్టీఅధ్యక్షురాలు జయాజెట్లీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X