వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద చేపలు చిక్కినవైనం....... Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ను వీడియో సాక్ష్యాలతో సహాబట్టబయలు చేసిన తెహల్కా డాట్‌ కాంమరో అద్భుతం సృష్టించింది. పథకం ప్రకారం రక్షణశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని వీడియోసాక్ష్యాలతో సహా బట్టబయలు చేసింది.

అసలు ఆ డాట్‌ కాం అవినీతికి అలవాటు పడిన చేపల్నిపట్టుకొనేందుకు ఏ విధంగా పథకం రూపొందించింది...... ఏ చేపలు ఆ డాటా కాంవలలో పడ్డాయనే కథాక్రమం.....

  • 2000 ఆగస్టులో డాట్‌ కాం రిపోర్టర్లు ఇద్దరు రక్షణ శాఖకు సంబంధించిన పరికరాలు సరఫరా చేసే కంపెనీ సిబ్బందిగా అవతారం ఎత్తారు.
  • రక్షణ శాఖలో ఆయుధ డీలర్లకు సాయం చేసే సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శశిమీనన్‌ ను కలిశారు. లండన్‌ కు చెందిన వెస్ట్‌ ఎండ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. చేతిలో ఇమిడే ధర్మల్‌ పరికరాలు భారత్‌ కు సరఫరా చేస్తామని, వీటిని రక్షణ శాఖ చేత కొనిపించేందుకు సహకరించాలని అతనిని కోరారు.
  • శశిమీనన్‌ ఈ ఇద్దరిని ఢిల్లీలోని ఒక బ్రిగేడియర్‌ ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ముడుపుల పర్వానికి తెరలేచింది.
  • ఆ తరువాత రక్షణ శాఖ ఉన్నతాధికారులు, రాజకీయ దళారీలు, బడా రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. వీరందరితో జరిగిన సమావేశాలను డాట్‌ కాం రిపోర్టర్లు వీడియోలు తీశారు.
  • రక్షణ శాఖకు దుస్తులు సరఫరా చేసే సురేంద్ర శుక్లా, రిటైర్డ్‌ అడిషినల్‌ జిడిపి మురుగైలతో కలిసి వారిద్దరూ సమతా పార్టీ నాయకురాలు, రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ సన్నిహితురాలు జయా జైట్లీని కలిశారు. ఆమె వారికి భరోసా ఇచ్చి 2 లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్నారు.
  • అరెస్సెస్‌ కీలక ట్రస్టీ, ఆయుధ ఒప్పందాల మధ్యవర్తి ఆర్‌. కె. గుప్తా ద్వారా వీరిద్దరూ బిజెపి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ ను కలుసుకున్నారు. ఆయనకు లక్ష రూపాయలు అందజేశారు. ప్రధాని ముఖ్య కార్యదర్శి బ్రిజేష్‌ మిశ్రా ద్వారా సహకరిస్తామని లక్ష్మణ్‌ వీరికి హామీ ఇచ్చి లక్ష రూపాయలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ డాట్‌ కాం వీడియోలో బంధించింది. లక్ష్మణ్‌ పలుకులను రికార్డు చేసింది.
  • అడ్వాన్సుగా లక్ష రూపాయలు తీసుకొని ఇంకా 30 వేల డాలర్లు ఇవ్వాలని కోరాలు. డబ్బు మొత్తం డాలర్ల రూపంలోనే ఇవ్వాలని కోరారు.
  • లక్ష్మణ్‌ పి.ఎం., ఆయన ఆఫీసు సిబ్బంది కూడా ముడుపులు తీసుకున్నారు.
  • పి.ఎం. కార్యాలయం మొదలు కొని, పలువురు కేంద్ర మంత్రులు, బడా ఆయుధ వ్యాపారులు, వారికి వివిధ పార్టీల ప్రముఖులతో వున్న సంబంధాలు, రక్షణ శాఖలో బడా అధికారులలో పేరుకపోయిన అవినీతి పర్వాన్ని తెహల్కా వీడియో రూపంలో పూసగుచ్చినట్లు మంగళవారం కొత్త ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించింది.
  • 4 గంటల పాటు సాగిన ఈ వీడియో ప్రదర్శనతో వందలాది మంది ఆర్మీ అధికారులు, పత్రికల వారు దిమ్మెర పోయారు.
  • ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రకంపనాలు మొదలయ్యాయి. తాను నిర్దోషినని అయినా నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని బంగారు లక్ష్మణ్‌ ప్రకటించారు.
  • ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం గురించి ఆరా తీయడం ప్రారంభించాయి. జార్జీ ఫెర్నాండెజ్‌ రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
  • లక్ష్మణ్‌ రాజీనామాను బిజెపి నాయకత్వం పెండింగ్‌ లో పెట్టింది. ఆరెస్సెస్‌ ప్రముఖుడు కూడా ఈ వ్యవహారంలో అవినీతి మూర్తిగా అవతారం ఎత్తి దర్శనం ఇవ్వడంతో పార్టీ ఖంగుతింది.
  • బంగారు లక్ష్మణ్‌ రాజీనామా
  • రక్షణలావాదేవీల్లో మామూళ్లు
  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X