• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌ సంచలన విజయం

By Staff
|

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లోఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్‌మాచ్‌లోభారత జట్టు సంచలన విజయం సాధించింది.ఇప్పటివరకుపదహారు టెస్ట్‌మ్యాచ్‌ల్లో వరుసనే విజయాలుసాధిస్తూ అప్రతిహతంగా పురోగమిస్తున్న స్టీవ్‌వా జట్టు జైత్రయాత్రకు భారత్‌ ఆటగాళ్లుకళ్లెం వేశారు. ఫాల్‌ఆన్‌ ఆడుతూ విజయంసాధించిన మూడో జట్టుగా భారత్‌ రికార్డుసృష్టించింది. అరివీర భయంకరంగా ఆడి 286పరుగులు చేసిన హైదరాబాద్‌ ఆడుగాడులక్ష్మణ్‌ మాన్‌ఆఫ్‌ మాచ్‌ గా ఎంపికయ్యారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోఆస్ట్రేలియా 445 పరుగులు చేయగాభారత్‌ కేవలం 171 పరుగులతోసరిపెట్టుకుని దయనీయ స్థితిలో వుంది.భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగుల లోటునుపూడ్చుకోవడంతో పాటు ఆస్ట్రేలియాజట్టుముందు 384 పరుగుల భారీ లక్ష్యాన్నివుంచింది. ఆటకు గురువారం నాడు ఆఖరు రోజుకావడంతో ఆట డ్రాగా ముగియడం ఖాయమని దాదాపుఅందరూ అనుకున్నారు.

అయితే భారత బౌలర్లుచిచ్చరపిడుగుల్లా చెలెరేగి ఆస్ట్రేలియాను274 పరుగులకు ఆలౌట్‌ చేయడంతో భారత్‌సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నది.171 పరుగుల ఆధిక్యతతో భారత్‌ విజయంసాధించిన ఈ టెస్ట్‌మ్యాచ్‌ ఆద్యంతంఉత్కంఠతో కొనసాగింది. హైదరాబాద్‌ ఆటగాడువివిఎస్‌ లక్ష్మణ్‌ ఈ మ్యాచ్‌లో సరికొత్తరికార్డును సృష్టించారు.ఈ మ్యాచ్‌లోనేహర్‌భజన్‌సింగ్‌ హ్యాట్రిక్‌తోచెలరేగాడు. గురువారం నాడు ఆఖరు వికెట్‌నుకూడా సింగ్‌ తీసుకున్నాడు.

అసెంబ్లి అభినందన

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాపైభారత్‌ జట్టు సాధించిన సంచలనం విజయంపట్ల ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ హర్షంవ్యక్తం చేసింది. భారత జట్టుఆటగాళ్లకు సభ అభినందనలు తెలియజేసింది.ఈ విజయంలో కీలకపాత్రధారి, హైదరాబాద్‌ఆటగాడు వివిఎస్‌ లక్ష్మణ్‌ను సభప్రత్యేకంగా అభినందించింది. తొలుతసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు సురేష్‌రెడ్డిప్రస్తావిస్తూ, సభ భోజన విరామం కోసం వాయిదాపడిన సమయంలో, కోల్‌కతాలోజరుగుతున్న టెస్ట్‌మాచ్‌లో భారత్‌ఆస్ట్రేలియా పై సంచలన విజయం సాధించిందనిసభ దృష్టికి తెచ్చారు. ఈ విజయం సాధించినభారత ఆటగాళ్లను మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ఆటగాడు లక్ష్మణ్‌ను అభినందిస్తున్నట్టుగాఆయన పేర్కొన్నారు. ఆయనతో ఏకీభవిస్తూ వివిధపార్టీల సభ్యులు మంత్రి అశోక్‌ గజపతిరాజుభారత జట్టును అభినందించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more