• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

By Staff
|

న్యూఢిల్లీ: ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు రాష్ట్రపతి ఆర్‌కె నారాయణన్‌ కలుసుకున్నారు. రాష్ట్రపతి పిలుపుపైనే ప్రధాని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ ప్రధాని కార్యాలయం మాత్రం ఈ వార్తలను ఖండించాయి. ప్రధాని తామే స్వయంగా రాష్ట్రపతిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు చెప్పాయి.

రక్షణ శాఖ లావాదేవీల్లోని అవినీతితో ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులకు ప్రత్యక్ష ప్రమేయం వున్నదంటూ సాక్ష్యాధారాలతో సహా తెహల్కా డాట్‌కామ్‌ చేసిన ఆరోపణలతో రాజకీయ రంగం వేడెక్కి వున్న తరుణంలో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం.

తెహల్కాడాట్‌కామ్‌ చేసిన ఆరోపణలను, దరిమిలా రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రధాని తామే వెళ్లి రాష్ట్రపతికి వివరించారని అంటున్నారు. రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ విషయంలో కాబినెట్‌ వైఖరిని కూడా ప్రధాని, రాష్ట్రపతికి వివరించి వుంటారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X